గంభీర్ కు లక్ష్మణ రేఖ.!

Publish Date:Jul 28, 2026

Advertisement

ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో  టి20 సిరీస్ లలో  వరుస ఓటముల్లో కుదేలైన టీమ్ ఇండియా .. జింబాబ్వే తో జరిగిన మూడు టి20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి కొత్త జవసత్వాలను అందిపుచ్చుకుంది. ఈ సిరీస్ లో సానుకూలాంశమేంటంటే..   హెడ్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ల మార్గదర్శకత్వంలో యంగ్ టీమ్ మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్. సీనియర్లు విశ్రాంతి తీసుకున్నా ఈ సిరీస్ ను యంగ్ ప్లేయర్లను ముందుండి నడిపించడంలో కోచ్, స్కిప్పర్లు ఘన విజయం సాధించడం విశేషం.

 జింబాబ్వేపై 3-0తో సాధించిన క్లీన్ స్వీప్ భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి   డెబ్యూటెంట్లలో కాన్ఫిడెన్స్ నింపి, వారి నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టిన  వెరీ వెరీ స్పెషల్ వీవీవీఎస్ లక్ష్మణ్ ప్రశాంతత, విజన్ క్రికెట్ అభిమానుల మనస్సులను హత్తుకుంది. 
 దీంతో ప్లేయర్లపై దురుసుగా వ్యవహరిస్తూ, ఇష్టారీతిగా టీమ్ కాంబినేషన్ ను మార్చేస్తూ వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా వ్యవహరించే గౌతం గంభీర్ కు ఇక విశ్రాంతి ఇస్తే మేలన్న చర్చ ఇటు క్రికెట్ అభిమానుల్లోనూ, అటు నెటిజన్లలోనూ జోరుగా సాగుతోంది.

జింబాబ్వే తో టి20 సిరీస్ ను రెగ్యులర్ కోచ్ గౌతం గంభీర్ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ఐర్లండ్, ఇంగ్లాండ్ లతో వరుసగా రెండు టి20 సిరీస్ లలో పరాజయం పాలైన టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ గా పని చేసిన గంభీర్ వ్యవహార శైలి కారణంగానే ఆ ఓటములు ఎదురయ్యాయని క్రికట్ అభిమానులు అంటున్నారు.  వివిఎస్ లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నయా డెబ్యూటెంట్లు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్‌లు మైండ్ బ్లోయింగ్  పర్ఫార్మన్స్ లు ఇచ్చారు. ఇంగ్లాడ్ టూర్  వైఫల్యాల తర్వాత లభించిన ఈ బిగ్ విక్టరీతో    గౌతమ్ గంభీర్ కు ఉద్వాసన పలికి, వీవీఎస్ లక్ష్మణ్ ను  పర్మనెంట్ హెడ్ కోచ్‌గా నియమించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఒక విధంగా జింబాబ్వే టూర్ తో గౌతం గంభీర్ కు లక్షణ రేఖ గీసినట్లేనని క్రీడా పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. సీనయర్ ప్లేయర్లతో గౌతం గంభీర్ కు ఉన్న విభేదాలు, ఆయన వ్యవహార శైలి యువ క్రికెటర్లలో కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసేలా ఉన్నాయనీ, టీమ్ ఇండియా విజయపరంపర కొనసాగాలంటే గంభీర్ కు ఉద్వాసన పలకడమే మేలని అంటున్నారు.  

VVSLaxman, autamGambhir, TeamIndia, ZIMvIND, CricketNews, TeluguOne

By
en-us Political News

  
మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్‌హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు.
మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు.. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిసిర్ బేస్రాపై ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అజ్ఞాతంలోనే ఉన్నారు.
వర్షాల తీవ్రత వల్ల పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కామరూప్, ధుబ్రి, లఖింపూర్, దిబ్రూగఢ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఇన్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి, దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన నివేదిక వీడియోతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నౌక పరిసర ప్రాంతాల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతుండటం, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేస్తుండటం ఎఫ్సీయూ ఐవిడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
మీ పుస్తకాల అభిరుచికి సరిపోయే సరైన నవలల కోసం వెతుకుతున్నారా? నా లైబ్రరీలోని పుస్తకాలతో ఛాట్‌జీపీటీ చేసిన అద్భుత ప్రయోగం, 30 నిమిషాల్లో అది అందించిన పర్సనలైజ్డ్ బుక్ రికమండేషన్ల రహస్యాలు ఇక్కడ చదవండి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం బంగారం ధరలు త్వరలోనే దిగివచ్చే అవకాశం ఉంది. పసిడి మార్కెట్ పరిస్థితులు, తగ్గుదలకు గల కారణాలు మరియు తాజా ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కాలిఫోర్నియాలోని 330 MW డేటా సెంటర్ కూలింగ్ కోసం 287 మిలియన్ గాలన్ల వ్యవసాయ నీటిని మళ్లించే ప్రయత్నాన్ని వాటర్ డిస్ట్రిక్ట్ అడ్డుకుంది. $10 బిలియన్ల ప్రాజెక్ట్ చుట్టూ రేగిన చట్టపరమైన పోరాటం మరియు రైతు ఆందోళనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ డైట్ అడిగి తెలుసుకుని, ఏడాదిన్నర పాటు పాటించిన సంజూ శాంసన్ ఆ తర్వాత ఎందుకు గివ్ అప్ ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.