అనంతపురంలో రైలు ప్రమాదంలో 16మంది మృతి
Publish Date:May 21, 2012
Advertisement
అనంతపురం జిల్లా పెనుకొండ రైల్వే స్టేషనులో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారు జామును ఆగి ఉన్న గూడ్స్ రైలును హంపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.ప్రమాదంలో 300 మంది దాకా గాయపడ్డారు. వీరిలో 50 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు.మరణించినవారిలో రైలు డ్రైవర్‌తో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గూడ్స్ రైలు ఆగి ఉన్న పట్టాలపైకే హంపీ ఎక్స్‌ప్రెస్ రైలుకు సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 18 మందిని రక్షించినట్లు జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ చెప్పారు. అనంతపురం జిల్లాలో ఉన్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మంత్రి రఘువీరా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
http://www.teluguone.com/news/content/train-accident-24-14196.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.





