శ్రీరామనవమి శోభాయాత్రకు భారీ ట్రాఫిక్ మళ్లింపులు

Publish Date:Mar 26, 2026

Advertisement

 

హైదరాబాద్  నగరంలో శ్రీరామనవమి సందర్భంగా భారీ ఎత్తున నిర్వహించే శోభాయాత్రకు విస్తృతమైన ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. రేపు మార్చి 27న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాతనగరం, సెంట్రల్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమై సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల పాఠశాల వరకు కొనసాగనుంది. ఈ యాత్ర సాగే మార్గంలో భారీగా భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టారు.

నగరంలో ప్రధాన మార్గాలపై మళ్లింపులు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆసిఫ్‌నగర్, భోయిగూడ కమాన్, అఘాపురా, మంగళ్‌హాట్, పురానాపూల్, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, అబిడ్స్, కోఠి, చాదర్‌ఘాట్, కాచిగూడ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు మార్పులు ఉంటాయి. ముఖ్యంగా యాత్ర సాగుతున్న మార్గాల్లో సాధారణ ట్రాఫిక్‌ను పూర్తిగా మళ్లించనున్నారు. భోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం, టక్కర్‌వాడీ జంక్షన్, MJ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, బేగంబజార్ ఛత్రీ, SA బజార్, MJ మార్కెట్ వంటి కీలక కూడళ్ల వద్ద వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు దారి మళ్లిస్తారు. రద్దీకి గురయ్యే ప్రాంతాలు పోలీసుల అంచనా ప్రకారం  బేగంబజార్ ఛత్రీ, SA బజార్,అఫ్జల్‌గంజ్ T జంక్షన్,శివాజీ బ్రిడ్జ్ – CBS పరిసరాలు,రంగమహల్ Y జంక్షన్,పుట్లిబౌలి ఎక్స్ రోడ్ అబిడ్స్ GPO, MJ మార్కెట్ ,చాదర్‌ఘాట్... కాచిగూడ ఎక్స్ రోడ్ ఈ ప్రాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది..

ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రజలు అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని, అత్యవసరంగా బయలుదేరే వారు ముందుగా మార్గా లను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం సోషల్ మీడియా పేజీలను ఫాలో కావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 ను సంప్రదించవచ్చు. శ్రీరామనవమి వేడుకలను శాంతియుతంగా, భద్రంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
 

By
en-us Political News

  
మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
తంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్‌క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాలన్నీ ఇక్కడికే మారాయి. ప్రయాణ సమయం, దూరం, టెర్మినల్ అప్‌డేట్స్ మరియు విమానయాన సంస్థలు జారీ చేసిన కీలక జాగ్రత్తల పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
స్విగ్గీ మరియు ఎటర్నల్ షేర్లు 7 శాతం వరకు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడుల వాటా 50 శాతం కంటే తగ్గడం మరియు క్విక్ కామర్స్ మార్జిన్ల బూస్ట్ అవకాశాలపై బ్రోకరేజ్ సంస్థల లేటెస్ట్ రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
భారతదేశంలోని మహిళా సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల బ్యాంకు బ్యాలెన్స్ 84% పెరిగింది. మహారాష్ట్ర లాడ్కీ బహిన్ , ఒడిశా సుభద్ర యోజన పథకాల వల్ల నెలవారీ ఖర్చులు, యూపీఐ డిజిటల్ లావాదేవీలు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం ఎలా పెరిగాయో EAC PM తాజా నివేదిక ఆధారంగా తెలుసుకోండి.
భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తుండగా, తిలక్ వర్మ మరియు వైభవ్ సూర్యవంశీ అవుట్ కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్‌డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.