రోడ్ ఫెస్టివల్.. గుడివాడ ఎమ్మార్వోపై దాడి.. పిచ్చి వీర్రాజు.. టాప్‌న్యూస్ @7pm
Publish Date:Feb 17, 2022
Advertisement
1. దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకమన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్‌తో పాటు పలు జాతీయ రహదారులను ప్రారంభించారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి 3 లక్షల కోట్లు ఇస్తామని, 6 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు.. 30 ఆర్వోబీలు నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ తూర్పు రింగ్ రోడ్‌కు అనుమతి ఇచ్చారు గడ్కరీ. 2. గుడివాడ తహసీల్దార్‌పై మంత్రి కొడాలి నాని క్యాంప్ ఆఫీస్‌లోనే దాడి జరిగిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. ఓ థియేటర్‌కి సంబంధించి ఎన్ఓసీ ఇవ్వలేదనే కారణంతో తహసీల్దార్‌ను కొట్టారని అన్నారు. దళిత అధికారులపై దాడులు చేసేలా పార్టీ నేతలకు పేటెంట్ ఇచ్చినట్లుగా సీఎం తీరు ఉందని మండిపడ్డారు. 3. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. లక్షా 90 వేల ఖాళీలున్నా భర్తీ చేయడం లేదని తప్పుబట్టారు. దరిద్రుడు సీఎం కావడం వల్లే నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే మూడ్రోజుల వేడుకలు అవసరమా? ఎవరైనా చనిపోతే సంతాప దినాలు చేస్తారు.. పుట్టినరోజుకు కాదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. 4. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. విద్యుత్ కేంద్రం అమ్మకంలో విద్యుత్ శాఖ మంత్రికి అందిన ముడుపులు ఎంత అని ప్రశ్నించారు. ఏపీలో జిల్లా కలెక్టర్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. బకాయిలు పెరిగి కలెక్టర్ల కార్లకు పెట్రోల్ కూడా కొట్టడం లేదని ఎద్దేవా చేశారు. దళితుల స్కాలర్‌షిప్‌లను పక్కదారి పట్టించిన వైసీపీ.. దళిత వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. 5. ఏపీలో పార్లమెంట్ పరిధిని ఆధారంగా చేసుకుని జిల్లాలను విభజించడం అనాలోచిత నిర్ణయమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. 2026లో దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పునర్విభజనతో సరిహద్దులు మారతాయని గుర్తు చేశారు. అప్పుడు మళ్లీ జిల్లాలను మారుస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 6. సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజు అంటూ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. మతిభ్రమించి సోము వీర్రాజు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి ఓ రౌడీ అని, పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానందిలో అర్చకులపై బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి దుర్భాషలాడాడని, ఇదేనా బీజేపీ సంస్కృతి అని ప్రశ్నించారు. శ్రీశైలంలో జరిగిన అన్ని అవకతవకలపై చేతనైతే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. 7. సీఎం కేసీఆర్ కూతరు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి థర్డ్ ఫ్రంట్, ఏ ఫ్రంట్ అవసరం లేదన్నారు. తిరుమల శ్రీవారిని కవిత దంపతులు దర్శించుకున్నారు. దేశ రాజకీయాల్లోనూ టీఆర్ఎస్ చక్రం తిప్పుతుందన్నారు. తెలంగాణలో 105 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాని బీజేపీ.. టీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 8. ఒక మహిళగా వైఎస్ షర్మిల పార్టీ పెట్టకూడదా అని హోం మంత్రి సుచరిత ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ పెడితే ఏపీకి రాకుండా తరిమేశామంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళ సొంతంగా పార్టీ పెట్టుకుంటే తప్పుగా ఎందుకు కనపడుతుందని నిలదీశారు. 9. నాడు-నేడు స్కూల్స్‌లో రంగులు వేయడం మినహా చేసింది ఏమీ లేదన్నారు ఎంపీ రఘురామ. జిల్లాల విభజనపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తోందన్నారు. 40కోట్లు ఇచ్చి మాజీ మంత్రి వివేకాను హత్య చేయించాల్సిన అవసరం ఎవరికి ఉందని? ఆ హత్య వెనుక ఎవరున్నారు? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. 10. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియామకంలో కొత్త ట్విస్ట్ నడుస్తోంది. ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ పదవి కావటంతో సవాంగ్ ఐపీఎస్‌గా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో 17 నెలలు సర్వీస్ ఉండటంతో గౌతమ్ సవాంగ్‌తో స్వచ్ఛంద పదవీ విరమణ చేయిస్తారా? లేక, ఆయనే బాధతో రాజీనామా చేసేలా ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తోందా? అనే చర్చ నడుస్తోంది.
http://www.teluguone.com/news/content/top-news-7pm-39-131947.html





