రింగ్ మాస్టర్ సజ్జల!!

Publish Date:Feb 17, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం 24 గంటల్లో తీసుకున్న రెండు నిర్ణయాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయి కూర్చున్నాయి. ఒకటి ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ అయితే.. మరొకటి డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ. అయితే ప్రవీణ్ ప్రకాశ్ బదిలీపై వెలగపూడి సచివాలయంలోని ఉన్నతాధికారులే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లంతా... చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటూ.. చాలా ఖుషీ ఖుషీగా ఉన్నట్లు సమాచారం. 

మరోవైపు డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ పట్ల అటు ఉన్నతాధికారుల్లో.. ఇటు ఫ్యాన్ పార్టీ నేతల్లో  తీవ్ర గుబులు అయితే రేపుతోందన్నది మాత్రం సుస్పష్టం. చేయని తప్పుకు గౌతమ్‌ను బలి చేశారనే టాక్ అయితే... అమరావతిలో మాత్రం రచ్చ రచ్చ చేసి పెడుతోంది. 

ఎందుకంటే.. అధికారిక హోదాలో డీజీపీగా గౌతమ్ సవాంగే ఉంటారని... సదరు డీజీపీగా ఆయనకు ప్రభుత్వం అన్నీ సౌకర్యాలు కల్పిస్తోందని... కానీ.. డీజీపీగా తీసుకునే నిర్ణయాలు మాత్రం ఆయన చేతుల్లో ఉండవన్నే సంగతి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసునన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఎవరు నమ్మినా నమ్మక పోయినా ఇది మాత్రం పక్కా వాస్తవమని అమరావతిలోనే కాదు.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సైతం ఇదే చర్చ నడుస్తోంది.  

మరి అయితే డీజీపీ తీసుకునే నిర్ణయాలు అన్నీ ఎవరి చేతిలో ఉంటాయి.. వాటిని ఎవరు తీసుకుంటారంటే మాత్రం అందరి చూపుడు వేళ్లు మాత్రం ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపిస్తాయని సమాచారం. జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి సకల శాఖల మంత్రిగా ప్రాచుర్యం పొందిన సజ్జల వారే అనధికారిక హోంమంత్రిగా వ్యవహరిస్తారనే టాక్ అయితే రాష్ట్రంలో మస్త్ మస్త్‌గా నడిచింది.. నడుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా సజ్జల వారే ఆదేశాలిస్తారన్న టాక్ కూడా ఖాకీ డిపార్టుమెంట్‌లో ఉండనే ఉంది. 

రాష్ట్ర హోంమంత్రి ఎం సుచరిత ఎప్పుడైనా ప్రెస్‌మీట్లు పెట్టమని ఫ్యాన్ పార్టీ ఆఫీసు నుంచి ఆదేశాలు వస్తే మాత్రమే వాటిని ఆమె తూ.చ తప్పకుండా పాటిస్తారు. అంతే తప్ప ఆమె సమీక్షలు చేసే పరిస్థితి కూడా లేదని ఆ పార్టీ నేతలే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సాక్షిగా గుసగుసలాడుకుంటారు.   

అయితే డీజీపీ కార్యాలయంలోని అన్ని వ్యవస్థల్లో సజ్జల వర్గానికి చెందిన వ్యక్తులు కీలకంగా ఉన్నారనే చర్చ కూడా బాహటంగా ఉంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో ఓ సీఐ సివిల్ దుస్తుల్లో అల్లరి మూకలతో కలిసి దాడులు చేస్తూ దొరికిపోయారంటు నాడు మీడియా సాక్షిగా రచ్చ రచ్చ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక రాజకీయ నేతల అరెస్టులను సీఐడీ చేతుల మీదుగా జరిపిస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో రాజకీయ కక్ష సాధింపులన్నీ సీఐడీనే పర్యవేక్షిస్తోందనే అపవాదును సైతం ఈ జగన్ ప్రభుత్వం మూట కట్టుకోంది. అసలు డీజీపీగా ఉన్న సవాంగ్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండానే.. ఈ వ్యవహారాలన్నీ అంతా సైలెంట్‌గా జరిగిపోతుందంటారు పోలీసు శాఖలోని  పలువురు ఉన్నతాధికారులు. తాజాగా ఎమ్మెల్సీ పి.అశోక్ బాబును అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు.. అదనపు ఎస్పీని సంప్రదిస్తే తమకు విషయం తెలియదని ఆ విషయాన్ని సీఐడీనే అడగాలని చెప్పడం గమనార్హం. 

అలా పోలీసు వ్యవస్థలో భాగమైన సీఐడీపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి అసలు అదుపు లేకుండా పోయిందని చెప్పటానికి ఓ ఉదాహరణ మాత్రమే. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ విషయంలో కూడా జగన్ ప్రభుత్వాన్ని డీజీపీ సవాంగ్ నిరాశపర్చలేదు. ఆయన సైలెంట్‌గా ఉండి. .. ఎప్పుడు ఏది మాట్లాడమని చెబితే అది మీడియాకు ఆయన చెబుతూ వచ్చారు.. వస్తున్నారు. ఇలా చెబితే తన పరువు పోతుందని తెలిసినా కూడా అన్నిటికి సిద్దపడి డీజీపీగా గౌతమ్ అదే చేశారు. 

అదీకాక.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చాలా సార్లు.. డీజీపీగా గౌతమ్ తన ఇమేజ్‌ను సైతం పోగట్టుకున్నారనే టాక్ కూడా పోలీస్ శాఖలో ఉంది. సీఎంగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి ఎంపికగా సవాంగ్‌ను డీజీపీగా నియమించారు. అయితే జగన్ పదవీ బాధ్యతలు చేపట్టక ముందే సవాంగ్ యాక్షన్‌లోకి దిగిపోయారు. 

అప్పటి నుండి ఆయన పనితీరు విషయంలో ప్రభుత్వం ఎక్కడా అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరగలేదు. చివరకు సోషల్ మీడియా పోస్టుల అరెస్టుల విషయంలో ప్రజల నుంచి విమర్శలు వచ్చినా.. కోర్టుల నుంచి నోటీసులు అందుకున్నా కూడా ప్రభుత్వం మాత్రం డీజీపీ గౌతమ్ పనితీరుపై సంతృప్తికరంగానే ఉందని తెలుస్తోంది. 

మరి ప్రభుత్వాన్ని జగన్ నడిపిస్తుంటే.. పోలీసు శాఖను మాత్రం సకల శాఖల మంత్రి సజ్జల నడిపిస్తున్నారని.. అలాంటిది.. గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేయడం ఎంత వరకు సబబు అని పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సజ్జల వారి డైరెక్షన్‌లో పోలీసు శాఖ పని చేస్తుంటే.. పనిష్మెంట్ మాత్రం గౌతమ్ సవాంగ్‌కి ఇవ్వడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు.. ఖాకీ డ్రస్‌తో ఉద్యోగం చేసుకునే గౌతమ్ సవాంగ్‌కు.. ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించి.. చివరకు ఆయనకు ఆ డ్రస్‌ను కూడా దూరం చేసిందనే చర్చ అయితే పోలీస్ శాఖలో నడుస్తోంది. డీజీపీగా గౌతమ్‌ను తప్పించడం.. జగన్ ప్రభుత్వంలోని సజ్జల స్క్రిప్ట్‌లో భాగమేననే చర్చ అయితే అమరావతిలో హాట్ హాట్‌గా నడుస్తోంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.