కారును షెడ్డులో పడేయాలంటున్న కమలనాథులు

Publish Date:May 19, 2012

Advertisement

భారతీయజనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంచి ప్రసంగకర్త, విమర్శకుడు. ఆయనే కనుక మేలికపెడితే ఎలా వుంటుందో ఒక్కసారి రుచి చూసిన వారు జీవితంలో మరువలేరు. అంతటి ఘాటైన విమర్శలు చేసే కిషన్ రెడ్డి ఓ కొత్త మెలిక పెట్టి తెలంగాణా రాష్ట సమితిని ఇరుకున పెట్టారు. "తెలంగాణా కోసమే టి.ఆర్.ఎస్. ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఇక పోటీ నుంచి తప్పుకోవాలి .... ఎందుకంటే తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం తీసుకురావటం టి.ఆర్.ఎస్. కు చేతకాదు. అది తేవాలంటే కేంద్రస్థాయి నుంచి కింది దాకా ఉండే ఒక్క బిజెపికే సాధ్యం. అందుకని తెలంగాణా కోసం మా వెనుకే ఉంటే చాలు.

 

అసలు తెలంగాణా కేసిఆర్ జీవితలక్ష్యమైతే దాన్ని నెరవేర్చుకునేందుకు సహకరించా ల్సిందే. తెలంగాణలో ఒక్క టి.ఆర్.ఎస్. మాత్రమే ఉండదని మహబూబ్ నగర ఎన్నికల్లో మా పార్టీ విజయం నిరూపించింది. ఆ అక్కసుతోనే కేసిఆర్, జెఎసి చైర్మన్ కోదండరామ్ ను పదవి నుంచి తప్పించేందుకు చూస్తున్నారు. అలానే తెలంగాణా రావాలంటే టిడిపి అధినేత చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేయాలి. ఆయనే తెలంగాణా వ్యతిరేకి'' అని కిషన్ రెడ్డి చేసిన ప్రసంగం తెలంగాణలో సంచలనమైంది. ఈ సంచలన ప్రకటన టి.ఆర్.ఎస్.పై కోపంగా ఉన్న తెలంగాణావాదులను బిజెపి వైపు మళ్ళించవచ్చని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. కిషన్ రెడ్డి రెచ్చిపోయి చేసిన ఈ ప్రకటనపై టి.ఆర్.ఎస్. నాయకులు తీవ్రంగా స్పందించారు. మతతత్వ పార్టీ అయిన బిజెపి కు తెలంగాణాను తెచ్చెంత సీన్ లేదని అయితే సమైఖ్యవాదులనుంచి ముడుపులు తీసుకున్న ఆ పార్టీ నాయకులు తెలంగాణా వాదంలో చీలికకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పరకాల ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్టుకూడా దక్కదని ఎద్దేవా చేస్తున్నారు.

By
en-us Political News

  
ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..!
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సికింద్రాబాద్‌లోని  కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో  ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?
తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..!
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిన్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.