వెయ్యేళ్ల కంకల్ జైన శిల్పాన్ని పరిరక్షించాలి : పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
Publish Date:Jan 13, 2025
Advertisement
వికారాబాదు జిల్లా పూడూరు మండలం శంకర్ పల్లి గ్రామంలో చెల్లా చెదురుగా పడి ఉన్న దాదాపు 55 చారిత్రాత్మక శిల్పాలు ఆలనా లేక రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా పరిశోధకుడు డా ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. స్థానిక వారసత్వ ప్రేమికులు చాకలి సంపత్ కుమార్, సింహాద్రి వెంకటరామిరెడ్డిల సహకారంతో కంకల్ గ్రామంలోని గణేశాలయం , శివాలయం ఊరి మధ్యలోనూ , శివారులోనూ నిర్లక్యానికి గురైన బాదామీ చాళక్య కాలపు ( క్రీశ 8వ శతాబ్ది) నిలువెత్తు గణేశ, నంది శిల్పాలు , రాష్ట్ర కూటుల కాలపు ( క్రీ. శ 9 వ శతాబ్ది) జైన పార్శ్యనాథ మహవీర, యక్ష, యక్షణీ శిల్పాలు , కళ్యాణీ చాళుక్యుల కాలపు ( క్రీ. శ 11వ శతాబ్ది) నాగదేవతలు, కాకతీయుల కాలపు సప్త మాతృక, శత్రు సంహారంలో ప్రాణాలొదిన వీరుల శిల్పాలు , రెండు శాసనాలు, ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయన్నారు.
మసీదు వెనుక వైపు ఉన్న పార్శ్వనాథుడు , యక్ష, యక్షిణి శిల్పాలు, గ్రామం మధ్యలోనూ , చివరి చింత చెట్టు క్రింద ఉన్న వర్దమాన మహవీరుని, తల ,మొండెం భిన్నమైన శిల్పాలు
వీర భధ్రాయలం పక్కనున్న నాగులకట్టపై నున్న సింహం బొమ్మలతో చెక్కిన అతి పెద్ద వర్దమాన (మహవీరుని శిల్పం జాడ దొరకలేదు. )
రాష్ట్ర కూటుల శిల్పి శైలికి అద్దం పడుతున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు , వికారాబాద్ జిల్లాలోని ఎల్లంకొండతో పాటు కంకల్ కూడ వెయ్యేళ్ల నాటి దిగంబర జైన క్షేత్రమని ఈ శిల్పాలు రుజువు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఆ శిల్పాల చారిత్రక ప్రాధాన్యత పట్ల స్థానికులకు ఆయన అవగాహన కల్పించారు.
జైన, శైవ, శాస్త్ర మతాలకు చెందిన ఇన్ని శిల్పాలున్న కంకల్ గ్రామాన్నివారసత్వ గ్రామం ( హెరిటేజ్ విలేజ్ ) గా ప్రకటించి, ఆ శిల్పాలన్నింటినీ వీర భధ్రాలయ ప్రాంగణానికి , పీఠాలపై ఎత్తించి , చారిత్రక వివరాల పేరు పలకలను పెట్టించి, పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గట్టుపల్లి మల్లేష్, నీరటి రాములు, చిన్ని కృష్ణ, శివాలయ పూజారీ పాల్గొన్నారని ఆయన చెప్పారు.
http://www.teluguone.com/news/content/thousands-of-years-old-kankal-jain-sculpture-should-be-preserved-39-191246.html