తెలుగు మాటలతో వల.. లోన్ పేరుతో బురిడీ.. ఢిల్లీ ఫేక్ కాల్ సెంటర్ల గుట్టురట్టు..!

Publish Date:Aug 10, 2026

Advertisement

 

హలో సార్.. మేడమ్.. మేము ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తక్కువ వడ్డీకే భారీ లోన్ మంజూరైంది”.. అంటూ తెలుగులో మధురంగా పలకరింపు. మాటల్లో నమ్మకం కలిగించి.. ఆ తర్వాత ఒక్కో ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేయడం. చివరకు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి చేతులు దులుపుకోవడం. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ సైబర్ మోసాల దందాకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) చెక్ పెట్టింది. ఢిల్లీలోని శివ మార్కెట్‌లో నిర్వహిస్తున్న మూడు మోసపూరిత కాల్ సెంటర్ల పై టీజీసీఎస్బీ అధికారులు దాడులు చేసి 21 మంది మహిళా టెలీకాలర్లు, ఒక బ్యాంకు ఖాతాదారుడిని అరెస్ట్ చేశారు. 

ఈ కాల్ సెంటర్ల వెనుక కీలకంగా వ్యవహరి స్తున్న లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ కోసం పోలీసులు గాలిస్తు న్నారు.ఏడాదిన్నరగా సాగుతున్న ఈ దందాలో తెలుగు మాట్లాడే మహి ళలే ప్రధాన ఆయుధంగా మారారు. తెలంగాణకు చెందిన 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని బాధితులకు ఫోన్లు చేయించేవారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడే మహిళలతో ఫోన్ చేయించడం ద్వారా బాధితుల నమ్మకాన్ని సులభంగా పొందేవారు. తాము బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధు లమంటూ పరిచయం చేసుకుని ఆకర్షణీయమైన లోన్ ఆఫర్లతో వల విసిరేవారు.

లోన్ కావా లంటే ముందుగా  ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫి కేషన్ ఛార్జీలు, డాక్యుమెం టేషన్ ఫీజు, బీమా ప్రీమియం తదితర రుసుములు చెల్లించా లంటూ నమ్మించి వరుసగా డబ్బులు వసూలు చేసేవారు. బాధితుడు డబ్బులు చెల్లించిన తర్వాత మరింత మొత్తం అడగడం లేదా ఫోన్‌కు స్పందించకుండా తప్పించు కోవడం చేసేవారు.
మోసపోయామని గ్రహించి డబ్బులు తిరిగి అడిగిన వారిని కూడా వదిలిపెట్ట లేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పవంటూ బెదిరించడంతో పాటు వ్యక్తిగత వివరాలు, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తామని హెచ్చరించే వారు.

టీజీసీఎస్బీ దాడుల్లో 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్‌బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులోనే ఈ ముఠాకు తెలంగాణలో నమోదైన 22 సైబర్ నేర కేసులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మూడు కాల్ సెంటర్ల వెనుక ఉన్న ప్రధాన నిర్వాహకులు లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ముఠా వెనుక ఉన్న మరిన్ని వివరాలు, ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేశారు? ఎంత మొత్తం కొల్లగొట్టారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

TGCSB, Lalit Singh, Kuldeep Singh, Anil, Delhi Fake Call Centers, cyber crime case

By
en-us Political News

  
తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు..పోలీస్ బాస్ ఆగ్రహం..!
ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు..ఏపీలో మాయమవుతున్న పత్రికా స్వేచ్ఛ..!
పాతబస్తీలోని చారిత్రాత్మక అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవా ల్లో కీలక ఘట్టమైన ఘటం ఊరేగింపు సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం
శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్‌ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్‌ షెల్టర్‌ జోన్‌గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్ రావు..!
మద్యం మత్తులో ఇంజెక్షన్..! విద్యార్థిని ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ..!
మద్యం మత్తులో కారు డ్రైవర్ భీభత్సం.. ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..!
జేపీఎస్సీ పేపర్ లీక్ దుమారం.. విద్యార్థులపై పోలీసుల వాటర్ క్యాన్స్ ప్రయోగం..!
ళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
మీ స్మార్ట్‌ఫోన్ మరియు డిజిటల్ డేటాను హాకర్లు, డేటా చోరీ నుండి ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకోండి. నార్టన్, 1పాస్‌వర్డ్, ప్రొటాన్ మెయిల్ మరియు అథెంటికేటర్ యాప్‌లతో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ గైడ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.