టిజి, ఎరాసుకు సవాలుగా మారనున్న ఉప ఎన్నికలు
Publish Date:Mar 6, 2012
Advertisement
కర్నూల్ జిల్లా: కర్నూల్ జిల్లాలో మరో కొద్దినెలల్లో ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదిన్చాడంవల్ల, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై అనర్హత వేటు వేయడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరపాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు జిల్లాకు చెందిన మంత్రులు టిజి వెంకటేష్, ఎరాసు ప్రతాపరెడ్డిలకు సవాలుగా మారాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేడర్ లో అత్యధికులు జగన్ వెంట వున్నారు. దీనికి తోడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు మంత్రులకు ఏమాత్రం పట్టులేదు. ఎన్నికలకు మరో ఐదారు నెలల సమయం ఉన్నందున పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోగలమన్న ధీమాను ఈ ఇద్దరు మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. రెండు స్థానాలను గెలుచుకోవడానికి జగన్ వర్గం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ వర్గానికి చెందిన కేదార్ ను తిరిగి కాంగ్రెస్ లోకి రప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనికితోడు తెలుగుదేశంపార్టీ కూడా ఈ నియోజకవర్గాల్లో తమ పట్టును నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. శోభా నాగిరెడ్డి తిరిగి ఆల్లగాద్దనుంచి పోటీచేయడం ఖాయం. అయితే ఎమ్మిగనూరు నుంచి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తనకు బదులుగా తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని ఆయన జగన్ ను అభ్యర్ధిస్తున్నారు. అయితే జగన్ మాత్రం అందుకు అంగీకరించకుండా చెన్నకేశవరెడ్డే పోటీచేయాలని పట్టుబడుతున్నారు.
http://www.teluguone.com/news/content/tg-venkatesh-24-12431.html





