పాతగాయాలను కెలకడమెందుకు హరీష్!?

Publish Date:Jul 3, 2024

Advertisement

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమై అధికారానికి దూరమైంది. ఉద్యమ పార్టీగా మొదలై అధికారం సాధించిన ఆ పార్టీ, ఆ తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా పలు సందర్భాలలో చెప్పారు. అయితే ప్రజాదరణ కోల్పోయి అధికారానికి దూరమైన తరువాత బీఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంటే అవసరమైంది. అధికారంలో ఉండగా పాండవులు తమ అస్త్రాలను జమ్మి జట్టుపై దాచినట్లు.. బీఆర్ఎస్ కూడా సెంటిమెంటు అస్త్రాన్ని రాజకీయం మాటున దాచేసింది. అవసరార్ధం ఇప్పుడు బయటకు తీయడానికి ప్రయత్నిస్తోంది.   తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో జరుగుతున్న ప్రయత్నాన్ని సెంటిమెంట్ అస్త్రంతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. 

ఔను.. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకోగానే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడానికి రెడీ అయిపోయింది. రాష్ట్ర విభజన తరువాత ఈ పదేళ్లలోనూ విభజన సమస్యల సామరస్య పరిష్కారానికి ఇటువంటి ఒక ప్రయత్నం జరిగిన దాఖలాలు కనిపించవు. తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయయుడు ఈ దిశగా చొరవ తీసుకుని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన రేవంత్ క్షణం ఆలస్యం చేయకుండా చంద్రబాబును చర్చలకు ఆహ్వానించారు. ఇరువురూ ఈ నెల 6న ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. ఇరువురు ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హర్షం వ్యక్తం అవుతోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలంటే పాతగాయాలను కెలుక్కోవడం కాదు... అగాధాలను పూడ్చుకుని రెండు రాష్ట్రాలూ ప్రగతి దారిలో ముందుకుసాగడానికి బాటలు పరచడం. 

అయితే తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ మాత్రం ఇరు రాష్ట్రాల మధ్యా సమస్యల నెగడు రావణ కాష్టంలా రగులుతుంటేనే తమకు మనుగడ అని  భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు చంద్రబాబు, రేవంత్ ల భేటీని స్వాగతిస్తూనే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించిన చందంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. 
విభజన సమస్యల పరిష్కారం కోసం ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముందుకు రావడం మంచిదే అంటూనే హరీష్ రావు విలీన మండలాల ప్రస్తావన తీసుకువచ్చారు. తద్వారా తెలంగాణ సెంటిమెంటును రగల్చడానికి ప్రయత్నించారు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించే ముందు రేవంత్ రెడ్డి విలీన మండలాలను మళ్లీ  వెనక్కు ఇవ్వాలన్న షరతు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేస్తు న్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకువచ్చి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించుకున్నారనీ, అప్పట్లో ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కూడా సమర్ధించారనీ గుర్తు చేశారు. ఏకపక్షంగా జరిగిన ఈ విలీనం తెలంగాణ సమాజం హర్షించలేదని ఇప్పుడు అంటున్నారు.  

వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు వల్ల ఏడు విలీన మండలాలూ ముంపునకు గురౌతాయి. ఈ మండలాలు ఏపీలో విలీనం కాకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే అవకాశమే లేదు. అందుకే అప్పట్లో చంద్రబాబునాయుడు ఈ మండలాల విలీనం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అసలు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కనుక ఆ పార్టీ కూడా ఏడు మండలాల విలీనాన్ని సమర్ధించింది. విలీనం జరిగిపోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమూ మొదలైపోయింది. ఇప్పుడు ఆ మండలాలను వెనక్కు ఇవ్వాలంటూ కండీషన్ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేయడం రాజకీయ లబ్ధి కోసమే కానీ మరొకందుకు కాదు. అది జరిగే పని కాదని ఆయనకూ తెలుసు. కానీ అధికారానికి దూరమై, ప్రజామద్దతు కోల్పోయిన బీఆర్ఎస్  మళ్లీ పుంజుకోవాలంటే విలీన మండలాల పేరుతో సెంటిమెంట్ రగల్చడమే మార్గమన్న భావనతోనే షరీష్ రావు ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసలు తెలంగాణ అన్న పదాన్నే తన పార్టీ పేరు నుంచి తొలగించి... జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేయాలని కలలుగన్న ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకుని   పలుకుబడి సాధించాలని చేసే ప్రయత్నాలు ఫలించవని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను లేవనెత్తడం కొరివితో తల గొరుక్కోవడమే అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లకు, స్వామీజీలకు ఇచ్చిన ప్రాధాన్యతను జనం వారికి గుర్తు చేసి ఎగతాళి చేసే అవకాశాలున్నాయంటున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం నాడు జరిగే చారిత్రక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కి వచ్చిన చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ నగరం ఘన స్వాగతం పలికింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక కొద్ది రోజులు పట్టిసీమను వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది. ఈ ఏడాది నాగార్జున ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో పట్టిసీమ మోటార్లతో నీటి తరలింపు ప్రారంభించారు.
కేతిరెడ్డికి జగన్ విజయవాడకి రమ్మని కబురు చేశారట. అయితే కేతిరెడ్డి మాత్రం నేను ఇప్పుడు రాలేను.. నా మనసేమీ బాగాలేదు అని రిప్లయ్ ఇచ్చారట.
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా త‌ప్పద‌న్నా.. చేసిన పాపాలకు అస‌లు వ‌డ్డీతో టి సిస‌లుగా ఫ‌లితంబు అనుభ‌వించుట త‌ధ్య‌మ‌న్నా.. అంటూ సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఓ సినిమాలో ఓ పాట ఉంది. జీవితంలో మ‌నంచేసే మంచి చెడుల‌కు ఫ‌లితాలు త‌ప్ప‌కుండా అనుభ‌వించాల్సి వ‌స్తుంద‌ని దీని సారాంశం. ఈ పాట మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది.
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్ కు చేరాయి. హిందుత్వ భావజానం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజప రిణామంగా అంతా భావించేవారు. వామపక్ష పార్టీలు, బీజేపీలు కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీలకు భిన్నంగా సైద్ధాంతిక నిబద్ధతతో ఉంటాయని భావించేవారు. అయితే బీజేపీలో ఇప్పుడా పరిస్థితి లేదు.
కోడి సాధారణంగా పొయ్యి మీద వున్న గిన్నెలోకి చేరుతుంది.. కానీ, బ్రిటీష్ కొలంబియాలో ఒక కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ప్రపంచం మొత్తంలో అంకెలను, రంగులను గుర్తుపట్టి చెప్పగలిగే కోడిగా ఈ కోడి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది.
వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రిమాండ్‌లో వున్న రేపిస్టు సుధాకర్‌ని పరామర్శించాల్సిన అవసరం వుంది. హత్యాయత్నం కేసులో జైల్లో వున్న తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పాతిక  లక్షల రూపాయల ఖర్చు పెట్టించి పరామర్శించిన జగన్, ఇప్పుడు రేప్ కేసులో అరెస్టు అయిన సుధాకర్‌ని కూడా పరామర్శించాలి.
ఆయన తొలి సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి సామాన్య కుటుంబ నేపథ్యం ఆయనది. రెండు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పని చేస్తూ వస్తున్నారు. ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. తన పనితీరు ద్వారానే పార్టీ అధినేతను మెప్పించారు.
ఎక్కడో రంపచోడవరం గిరిజన గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసే ఒక యువతి ఎమ్మెల్యే అవుతుందని ఎవరైనా ఊహించగలరా? ఎవరో వేరేవారు ఊహించడం కాదు.. సాక్షాత్తూ ఆ యువతి కూడా ఊహించలేదు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ  మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ ఎల్ పిని కాంగ్రెస్ ఎల్ పిలో చేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు  ఒక్కొక్కరూ  కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు  ఒక్కసారిగా ఆరుగురు కాంగ్రెస్ లో   చేరిపోయారు.
టెక్సాస్‌లో వుండే మోనికా రిలే అనే ఓ బొద్దుగుమ్మ మాత్రం ఇలా అనుకోవడం లేదు. తాను బరువు బాగా పెరిగిపోవాలని కోరుకుంటోంది. అలా బరువు పెరగడం కోసం.... మూడు పూటలా కాదు... ఆరుపూటలా తింటూ కృషి చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.