తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు?

Publish Date:Jul 5, 2024

Advertisement

తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్ కు చేరాయి.  హిందుత్వ భావజానం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజప రిణామంగా అంతా భావించేవారు.

వామపక్ష పార్టీలు, బీజేపీలు కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీలకు భిన్నంగా సైద్ధాంతిక నిబద్ధతతో ఉంటాయని భావించేవారు. అయితే బీజేపీలో ఇప్పుడా పరిస్థితి లేదు. మిగిలిన రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలకు పెద్ద తేడా లేకుండా పోయింది. ప్రధానంగా  బీజేపీ నాయకత్వం మోడీ  చేతులలోకి వచ్చిన తరువాత పార్టీకి మిగతా పార్టీలకీ ఉండే తేడా మాయమైపోయింది. సిద్ధాంతం కంటే ఓట్లు, సీట్ల లెక్కలకే బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా బీజేపీకీ ఇతర పార్టీలకీ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూ తేడా లేని పరిస్థితి ఏర్పడింది. నాలుగు ఓట్లు, ఓ రెండు సీట్లు వస్తాయనుకుంటే.. బీజేపీ మౌలిక సిద్ధాంతాలతో విభేదించే వారిని కూడా కాషాయ కండువా కప్పి, రెడ్ కార్పెట్ పరిచి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో తొలి నుంచీ బీజేపీ సిద్ధాంతాలను నమ్మి ఆ పార్టీలో కొనసాగుతున్న వారికీ, మధ్యలో రాజకీయ కారణాలతో వచ్చి చేరిన వారికీ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితి  దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో  ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

2024 సార్వత్రిక ఎన్నికల తరువాత తెలంగాణ బీజేపీలో పాత వారు కొత్తవారు అన్న విభజన మరింత స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక దగ్గరకొచ్చేసరికి తొలి నుంచీ బీజేపీలో కొనసాగుతున్నవారు, మధ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి మధ్య విభేదాలు రచ్చకెక్కి ఘర్షణలకు, వాగ్యుద్ధాలకూ దారి తీసే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలో  మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్,  గోషామహల్ ఎంపీ రాజాసింగ్ ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. అంతే కాకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ముందన్న వారంతా బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన వారే ఉండటంతో తొలి నుంచీ పార్టీలో ఉన్న వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో పాటు బాహాటంగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడటంతో బీజేపీ హైకమాండ్ అధ్యక్షుడి నియామకాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. దీనిని బట్టే పార్టీలో వర్గ విభేదాలు ఏ స్థాయికి చేరాయో అర్థమౌతుంది. 

ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో పార్టీ ఆయనను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించింది. తదుపరి అధ్యక్షుడిగా ఎవరు అన్నదానిపై రాష్ట్ర నేతల అభిప్రాయాలను సేకరించడానికి ఉపక్రమించింది. ఈ తరుణంలోనే పార్టీలో ఒక్క సారిగా విభేదాలు భగ్గుమన్నాయి. తొలి నుంచి పార్టీలో ఉన్నవారు, ఆ తరువాత వచ్చిన వారూ రెండు గ్రూపులుగా చీలిపోయారు. దీంతో పార్టీలో నిట్టనిలువుగా చీలిక వచ్చే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందనరావు,  ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ రామచంద్రరావు వంటి వారు ముందు వరుసలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారు తమతమ లాబీయింగ్ ప్రారంభించినట్లు చెబుతున్నారు.  ఈ పరిస్థితి రాష్ట్రంలో బీజేపీని బలహీనపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్యాడర్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
కడప పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. అలా ఉప ఎన్నిక వస్తే ఊరూ వాడా తిరిగి ప్రచారం చేసే బాధ్యతను నేను తీసుకుంటా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయిన వైఎస్ జగన్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలతో వాతలు పెట్టారు. సోమవారం నాడు విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, పరోక్షంగా అనిపించినప్పటికీ ప్రత్యక్షంగానే జగన్ మీదకి మాటల బాణాలు వదిలారు.
మనం మనం ఒకటే అని చెప్పి, తన సామాజికవర్గానికే చెందిన వారిని మాయచేసి 514 కోట్ల రూపాయల భారీ మోసం చేసిన మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగ విద్యార్థులు ప్రతిభను కనబరిచి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వాళ్ళు మంత్రి లోకేష్‌ని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
బిఆర్ఎస్ నేతలు  కెటీఆర్, హరీష్ రావులు తీహార్ జైల్లో కవితను  పరామర్శించినట్టు వార్తలు పైకి వెలువడుతున్నప్పటికీ  అసలు ఎజెండా మాత్రం ఢిల్లీ పెద్దలను కలవడం అని తెలుస్తోంది.
జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిమ్స్.కి నీటి సరఫరా ఆపేశారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించింది కదా.. అందుకని! నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదువుతున్నాయి మహాప్రభో అని ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.
ఫ్రాన్స్ ప్రభుత్వం నెపోలియన్ వాడిన తుపాకులను జాతీయ సంపదగా ఇటీవలే ప్రకటించింది. అయినప్పటికీ, వీటిని బహిరంగ వేలంలో ఫ్రాన్స్ పౌరుడు ఒకరు కొనుగోలు చేశారు. వీటిని దేశం దాటించడానికి అవకాశం లేదు.
వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు భారీ వర్షాలు లేవు. నెల రోజులు దాటినప్పటికీ ఇంత వరకు భారీ వర్షాలు లేవు. కానీ  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం  నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవంపై దృష్టి సారించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ కచ్చితంగా తెలంగాణలో పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు. 
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. ఆ పార్టీ నుంచి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కింగ్ పిన్  అయిన   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.