అడుదాం ఆంధ్రాపై విజిలెన్స్ నివేదిక.. రోజాకు చిక్కులు తప్పవా?

Publish Date:Apr 8, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా చిక్కుల్లో పడ్డారా? ఆమె మంత్రిగా ఉన్న సమయంలో అడుదాం ఆంధ్రా అంటూ నిర్వహించిన భారీ  కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్ నివేదిక ఆమె ప్రమేయాన్ని నిర్ధారించిందా? అంటే విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఔను అన్న సమాధానమే వస్తున్నది. 

 వైసీపీ   హయాంలో అట్టహాసంగా నిర్వహించిన  ఆడుదాం ఆంధ్రా  క్రీడా సంబరాల్లో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిర్ధారించింది. ఈ మేరకు వేల పేజీలతో కూడిన సమగ్ర నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది.  ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో  స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన  ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.  
 
విజిలెన్స్ విచారణలో  నాణ్యత లేని క్రీడా పరికరాలు సరఫరా చేసినట్లు తేలింది.  బ్రాండెడ్ కంపెనీల ముసుగులో నాసిరకం బ్యాట్లు, బంతులు, టీ-షర్టులను పంపిణీ చేసినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తోంది.  విజేతలకు అందాల్సిన ప్రైజ్ మనీని పక్కదారి పట్టించడం, నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లించడం వంటి చర్యల ద్వారా ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని కూడా విజిలెన్స్ నివేదిక పేర్కొన్నట్లు చెబుతున్నారు.  

ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ  మంత్రి ఆర్కే రోజా, అలాగే అప్పటి  సాప్   చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిల ప్రమేయంపై కీలక ఆధారాలు లభ్యమైనట్లు విజిలెన్స్ తన నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.  క్రీడా స్ఫూర్తిని పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ కార్యకర్తలను విజేతలుగా ప్రకటించినట్లు విజిలెన్స్ గుర్తించింది. అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ, క్రీడలను పార్టీ ప్రచార వేదికగా మార్చుకున్నారని కూడా విజిలెన్స నివేదిక పేర్కొంది. కాగా రాష్ట్రంలో వైసీపీ సర్కార్ దిగిపోయి, తెలుగుదేశం ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టే సమయంలో  కొన్ని రికార్డులను, కంప్యూటర్ డేటాను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక  సాయంతో అధికారులు వాస్తవాలు బయటకు తీశారని చెబుతున్నారు.  

ప్రస్తుతం విజిలెన్స్ నివేదిక ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఉందంటున్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కుంభకోణంపై లోతైన దర్యాప్తు కోసం ఏసీబీ లేదా సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉందంటున్నారు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్న నేపథ్యంలో, త్వరలోనే మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పదివేల పేజీలకు పైగా ఉన్న విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందా అన్న ఉత్కంఠ వైసీపీయుల్లో కనిపిస్తోంది.  

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.