కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై స్టే ఎత్తివేత..!

Publish Date:Sep 1, 2026

Advertisement

హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!

 

పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై విధించిన స్టేను న్యాయస్థానం ఎత్తివేయడంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుతో ఈ పథకాల కింద ఆర్థిక సాయం కోసం ఎదురుచూ స్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఊరట లభించింద న్నారు. వివాహ సమయం లో పేద కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం వారి కష్టాలను కొంతమేర తగ్గిస్తుందని తెలిపారు. స్టే కారణంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి దరఖాస్తును త్వరి తగతిన పరిష్కరించి, లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకుండా చూడాలని, దరఖాస్తుల పరిశీలనలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కోర్టు స్టే విధించిన సందర్భంలో కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. 

కోర్టు విధించిన స్టేను పథకాల రద్దుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. న్యాయ స్థానం ప్రక్రియను వక్రీక రించి ప్రజల్లో అపోహలు, గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల విషయంలో రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనా లకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు తలెత్తినప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీ నాయ కులు సంతోషం వ్యక్తం చేయడం ఎందుకని మంత్రి ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని* పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ అధికారులు వేగంగా పరిశీలించాలని, అర్హత ఉన్న లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక సాయం అందించాలని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.


Telangana High Court, Kalyana Lakshmi Scheme, Shaadi Mubarak Scheme, Telangana Government, Minister Ponnam Prabhakar, High court, Telugu One, Telugu news

By
en-us Political News

  
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సికింద్రాబాద్‌లోని  కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో  ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?
తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..!
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిన్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
హైదరాబాద్‌ నగరంలోని ఫిలింనగర్‌ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.