ఐటీ రంగంలో తెలంగాణ‌ రాష్ట్రంతో ఏపీ పోటీ పడగలదా?

Publish Date:Jul 25, 2014

Advertisement

 

సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించడానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల దృష్టీ ఐటీ రంగంపై కేంద్రీకృతమై వుంది. ఐటీ రంగంలో తమ రాష్ట్రమే అగ్ర స్థానంలో వుండాలన్న బలమైన కోరిక రెండు రాష్ట్రాల్లోనూ వుంది.

 

అయితే కొంతమంది పరిశీలకులు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు వుంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని చూపిస్తున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన కల్వకుంట్ల తారక రామారావు ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దూసుకువెళ్తున్నారు. బాగా చదువుకున్న వ్యక్తి, విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేసిన వ్యక్తి, అద్భుతమైన కమ్యునికేషన్ స్కిల్స్ వున్న వ్యక్తి అయిన కేటీఆర్ హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి చురుగ్గా వ్యహరిస్తున్నారు. కేటీఆర్‌లోని చురుకుదనం, కార్యదక్షతతోపాటు వడ్డించిన విస్తరిలా వున్న హైదరాబాద్ కూడా తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో అద్భుత ఫలితాలను సాధించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

 

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఐటీ రంగానికి సంబంధించిన అనేక సెమినార్లు నిర్వహించడం, విదేశీ ప్రతినిధులను కలవటం, అనేక ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమై వున్నారు. మంత్రిగా కేటీఆర్ పనితీరును చూస్తుంటే తెలంగాణ అభివృద్ధిలో ఆయన కీలక వ్యక్తి అవుతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఐటీ రంగం ముందుకు దూసుకుని వెళ్ళడమే తప్ప వెనక్కి తిరిగి చూసే అవసరమే లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

తెలంగాణకి వున్న హైదరాబాద్ నగరం, కేటీఆర్ నాయకత్వం లాంటి అడ్వాంటేజెస్‌తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కి చెప్పుకోదగ్గ అవకాశాలు, నాయకత్వం లేవన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఐటీ రంగానికి ఒక చిరునామా అనేదే లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పల్లె రఘునాథరెడ్డి వయసు రీత్యా పెద్దవాడు. అంత చురుకుగా వ్యవహరించే వ్యక్తి కూడా కాదు. దానికితోడు ఐటీ రంగం మీద ఆయనకి వున్న అనుభవం దాదాపుగా శూన్యం.

 

అంతేకాకుండా ఆయన భుజస్కందాల మీద ఐటీ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఇతర కీలక శాఖల బాధ్యతలు కూడా వున్నాయి. ఇన్ని బాధ్యతలు మోస్తున్న ఆయన ఐటీ రంగానికి ఎంతవరకు న్యాయం చేయగలరన్న అనుమానాలు వున్నాయి. చంద్రబాబు నాయుడు దృష్టి పెడితే ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్ రంగం పుంజుకునే అవకాశాలు వుంటాయి. అయితే ఎన్నో సవాళ్ళతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు ఐటీ రంగం మీద దృష్టి ఎంతవరకు కేటాయిస్తారన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కంటే యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు అయిన కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలోనే ఐటీ రంగం అభివృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయమేమిటి?

By
en-us Political News

  
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.