ఆంక్షలు ఉల్లంఘించి భారీ కాన్వాయ్ తో అవినాష్ రెడ్డి పర్యటన: అంకాలమ్మ గూడురులో తీవ్ర ఉద్రిక్తత.!

Publish Date:Nov 20, 2026

Advertisement

జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే  కడప  ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైఎస్ అవినాష్ రెడ్డికి పెలీసులు నోటీసులు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నివాసం నుంచి  బయటకు రావద్దని పోలీసులు ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే , ఆ ఆంక్షలను ఖాతరు చేయకుండా  ఆయన భారీ వాహనశ్రేణితో పర్యటనకు బయలుదేరారు. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో వైఎస్ అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరుకు శుక్రవారం (నవంబర్ 20) చేరుకున్నారు. పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 

ఈ పరిణామాలకు ముందురోజు అంటే గురువారం (నవంబర్ 19)  టీడీపీ నేత బీటెక్ రవి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన వ్యవహార శైలిని తక్షణమే కట్టడి చేయాలని  డిమాండ్ చేశారు. ఇది జరిగిన  మరుసటే అవినాష్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి కాన్వాయ్‌తో పర్యటనకు వెళ్లడాన్ని టీడీపీ శ్రేణులు, స్థానికులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తూ   ఖండించారు.

అదలా ఉండగా,  అంకాలమ్మ గూడూరు వద్ద తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘటనలో ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందంటూ వైసీసీయులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. అయితే ఎంపీ కాన్వాయ్ పై పెట్రోల్ బాంబు దాడి వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు ఖండించారు.  ఆలా ఉండగా అంకాలమ్మ గూడురులో జరిగిన ఘర్షణలో తెలుగుదేశం కార్యకర్త ఒకరు గాయపడ్డారు. 

ఇది కూడా చదవండి:  అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై బాంబుదాడి: సింహాద్రిపురంలో ఉద్రిక్తత.!

ప్రస్తుతం అంకాలమ్మ గూడూరులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఘర్షణ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘర్ణణకు దిగిన వారిని స్వల్పంగా లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.

పులివెందులలోనూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆంక్షలు విధించి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిబంధనలను, ఆంక్షలను ఉల్లంఘిస్తూ కఠిన చర్యలు తప్పవని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో పంచాయతీ ఎన్నికలలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిందని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:   పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా?

పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.!


[Kadapa MP YS Avinash Reddy, Violate, estrictions, HugeCanvoy, Ankalamma Guduru, Pulivendula, TeluguOne]

By
en-us Political News

  
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.