రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు

Publish Date:Jul 17, 2012

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆందోళనల సమయంలో హైకోర్టులో జరిగిన ఘటనపై వ్యవహరించిన తీరును తప్పు బడుతూ సుప్రీం కోర్టు తీవ్రంగా ప్రభుత్వాన్ని అభిసంశించింది. న్యాయమూర్తులు హెల్మెట్‌లతో వచ్చి హైకోర్టులో విధులు నిర్వహించాల్సిన పరిస్థితిని తీసుకోస్తారా అని కోర్టు ఆగ్రహించింది. గొడవలు చేసిన న్యాయవాదులను గుర్తించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది.

ఇప్పటి వరకు ఆందోళనలకు పాల్పడిన ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని, బార్ కౌన్సిల్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఆందోళనలు చేసిన వారిని బార్ కౌన్సిల్ సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించింది. న్యాయస్థానాల్లో రౌడీయిజం, గుండాయిజం లాంటి చర్యలను ప్రభుత్వం సమర్థిస్తుందా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదుల లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. వారిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో  కోర్టులలో ఇలాంటి ఘటనలు జరగవని హామీ ఇవ్వగలరా అని అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్లో అనుకూలంగా తీర్పు రాకుంటే, న్యాయమూర్తులపైన కూడా దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.