మన ఎం.పీ.లు పైరవీలకే పరిమితమా?

Publish Date:Jul 17, 2012

Advertisement

మన పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారనుకుంటున్నారు....కేంద్రమంత్రులు ఏలా ఉండాలనుకుంటున్నారు..వారు సామాన్య ప్రజానీకాన్ని గురించి చర్చించి మెరుగైన సమాజం కోసం పాటుపడేవాళ్లగా ఉండాలనుకుంటుంన్నాం . కాని వారు మాత్రం సౌకర్యాలను అనుభవిస్తూ ప్రజలగురించి మాత్రం పూర్తిగా మర్చిపోయారనటానికి బోల్డన్ని ఉదాహరణలు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రాంతీయ వివక్షను ప్రక్కనపెట్టి ప్రాజెక్టులుగాని, విద్యుత్‌, గ్యాస్‌లపై అధనంగా మన రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి కాని అడిగిన పాపాన పోలేదు.

రిలయన్సు గ్యాస్‌ డ్రిల్లింగ్‌ జరుపుతున్న  కె.జి.బేసిన్‌ ప్రాంతానికి  చెందిన ఎంపి ఈ మద్య మాట్లాడుతూ ఎందుకు గ్యాస్‌ మనకు ఇవ్వవలసినదానికన్నా తక్కువ ఇస్తున్నారు మీరు ఎందువల్ల  తేలేక పోతున్నారంటే వారు డ్రిల్లింగ్‌ పర్మిషన్‌ తీసుకునేటప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన  పత్రాలపై సంతకాలు తీసుకోలేదని, ఇప్పుడు రిలయన్స్‌ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ద్వారా తమను వత్తిడికి గురి చేస్తున్నందువల్లే పార్లమెంటులోఅడగలేక పోతున్నామన్నారు. యుపిఎ గవర్నమెంటులో అందరికన్నా ఎక్కువ మంది ఎం.పి.లు  ఆంధ్రప్రదేశ్‌నుండి వెళ్లినా వివక్షకు గురి అవుతున్నాం. నగర అభివృద్దికోసం కేంద్రం తలపెట్టిన జవహర్‌లాల్‌ నెహ్రూ పట్టణ పునర్నిర్మాణానికి కెటాయింపులలోనూ వివక్షకు గురిఅయ్యాం. బెంగుళూరు, ముంబై, చెన్నై, కలకత్తాలు మనకు రెట్టింపు మొత్తాలు పొందాయి. 

నగరాల్లో  మంచినీటి సరఫరా, భూగర్బడ్రైనేజీ వర్షపునీటి పైపులైన్ల నిర్మాణానికి మన రాష్ట్రంనుండి 2,166 కోట్లవిలువైన ప్రతిపాధనలు పంపినా 3 సంవత్సరాలనుండి వాటికి మోక్షం రాలేదు. పోలవరం, చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం ఒక్కరు కూడా ప్రయత్నించడంలేదు. రైళ్లసంగతి అలాగేవుంది. మనకు  ఈ సంవత్పరం 31 రైళ్లు రాష్ట్రానికి మంజూరు చేసినా ఇప్పటివరకు 12 రైళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వైద్య శాఖపైకూడా అదే నిర్లక్ష్యం చూపుతుంది. ట్రామాకేర్‌ నిధులను ఐదేళ్ళ నుంచి మంజూరు చేయించుకోలేక పోయారు. నల్గొండ జిల్లాలోని బీబీనగర్‌ ఆసుపత్రి ది అదే పరిస్థితి. అడుగడుగునాప్రజాధనంతో విలాసాలు ,డిల్లీలో పైరవీలు తప్ప వీరు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్న విమర్శలు వస్తున్నాయి.
 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.