హైదరాబాద్: తెలంగాణాప్రాంతంలో జరగబోతున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలకు కలవరం కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అన్న నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుదామనుకున్న కాంగ్రెస్ నాయకులకు ఇటీవల వచ్చిన వార్తలు దిగ్బ్రాంతికి గురిచేశాయి. తెలంగాణాకోసం ప్రత్యేక మండలిని ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్లు, అలాగే ఈ ప్రాంత అభివృద్దిని ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తుండటం కాంగ్రెస్ నాయకులకు ఇబ్బంది కలిగించింది. కేంద్రానికి తెలంగాణా ఇచ్చే ఉద్దేశం లేదు కనుకనే ఇటువంటి ఆలోచనలను చేస్తున్నదన్న భావన ప్రజల్లో కలుగుతోందని వారు అంటున్నారు. "తెలంగాణాపై మా పార్టీ వైఖరి స్పష్టంగా లేదు. తెలంగాణా ఇస్తామని ఏనాడూ ప్రకటించలేదు. ఇప్పుడు మాత్రం ప్రత్యేక మండలి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనలు చేస్తున్నారు. అంటే దీనర్ధం తెలంగాణా ఇవ్వడం లేదని. తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉన్న ఈ సమయంలో ఎన్నికలు రావడం, ఎన్నికల సమయంలో ఇటువంటి ప్రకటనలు చేయడం పార్టీకి ఏవిధంగానూ లాభించదు" అని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు తెలుగువన్.కామ్ కు చెప్పారు. ప్రభుత్వ వైఖరిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తెలంగాణా రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నటికీ ప్రత్యేక తెలంగాణా ఇవ్వదని, ఆ పార్టీ సారధ్యంలోని ప్రభుత్వం పతనమైతేనే ప్రత్యేక తెలంగాణా వస్తుందని టిఆర్ఎస్ నాయకులు ఓటర్లకు చెబుతున్నారు. అసలు తెలంగాణా ఇస్తారా లేదా అన్న విషయం తేల్చకుండా ప్రత్యేక మడళ్ళు, ప్రత్యేక ప్యాకీజీలు ఎందుకని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-24-12364.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.