టి 20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీం ఇండియా అలవోక విజయం

Publish Date:Mar 8, 2026

Advertisement

మూడో సారి భారత్ ఖాతాలో టీ 20 వరల్డ్ కప్‌
 హిస్టరీ రిపీటెడ్.. హిస్టరీ రిపీటెడ్
దిల్ మాంగే తీన్మార్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం (మార్చి 8) జరిగిన టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అలవోక విజయం సాధించింది.  ఈ మ్యాచ్ లో  భారత్ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ఈ స్టేడియంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదన్న అపవాదును చేరిపేస్తూ  పరుగుల వరద పారించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్  నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన కివీస్‌ను  బౌలర్లు కట్టుదిట్టంగా కట్టడి చేయడంతో.. భారత్ 96 పరుగుల తేడాతో ఘప  విజయం సాధించింది. 

తొలుత టాప్ ఆర్డర్‌లో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు.  7.2 ఓవర్లలోనే భారత్ 100 పరుగుల మైలురాయి దాటిందంటే మనోళ్ల దూకుడు ఎలా కొనసాగిందో అర్థమవుతుంది. టాప్ ఆర్డర్‌లో ఓపెనర్ సంజూ సామ్సన్ (89, 46 బంతుల్లో), అభిషేక్ శర్మ (52, 21 బంతులు), ఇషాంత్ కిషన్ (54, 25 బంతులు) తగ్గేదేలే అన్నట్లు బ్యాట్‌కు పనిచెప్పారు.  తర్వాత హార్ధిక్ పాండ్యా (13 బంతుల్లో 18), శివమ్ దూబే (8 బంతుల్లో 26) స్కోరు బోర్డు పరుగులుపెట్టించారు. సూర్యకుమార్ యాదవ్ (0) విఫలమైనప్పటికీ మన ఆటగాళ్లు సమష్టి కృషితో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించారు. చివరి ఓవర్లో దూబే ఏకంగా రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు బాదడం విశేషం.  ఆక్రమంలో  20 ఓవర్లలో 255 పరుగులు చేసి మోడీ స్టేడియంలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా టీమ్ ఇండియా రికార్డ్ సృష్టించింది. ఇన్నింగ్స్‌లో మొత్తం 18 సిక్సులు, 19 ఫోర్లతో మన బ్యాటర్లు చెలరేగిపోయారు.  

న్యూజిలాండ్‌తో జరిగిన తుదిపోరులో భారత్‌ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయన్న విశ్లేషణలు వినిపించాయి.  టీ 20 వరల్డ్ కప్ చరిత్రతో న్యూజిలాండ్‌పై భారత్‌కు గెలుపు రికార్డు లేదు. ఇప్పటి వరకు తలపడిన మూడు సార్లు కివీస్ జట్టే విజయం సాధించింది. ఈ సారి  టీంఇండియా చరిత్ర తిరగరాసింది. ఇక గత 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే వేదికపై ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక ఓటమి కూడా ఈ పిచ్‌లోనే. సూపర్-8 దశలో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది . ఆ ఓటమి కూడా యాధృచ్చికమే అని మన ఆటగాళ్లు నిరూపించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (52, 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) వరుసగా విఫలమవుతున్నాడన్న విమర్శలను అద్భుత హాఫ్ సెంచరీతో తిప్పికొట్టాడు.  

డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా వరుసగా రెండో సారి విజేతగా నిలవడంతో పాటు టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో మూడో సారి టైటిలో గెలుచుకుని రికార్డు సృష్టించింది.  ఎందుకంటే ఇప్పటిదాకా ఈ టోర్నీ చరిత్రలో మూడు టైటిళ్లు సాధించిన జట్టు లేదు. అలాగే వరుసగా ఏ జట్టూ రెండోసారి గెలవలేదు. అంతే కాదు టి20 వరల్డ్ కప్ ను ఆతిథ్య జట్టు గెలవడం కూడా ఇదే తొలిసారి. 

By
en-us Political News

  
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన   ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా   ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై  కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.