అమరావతిలో తిరుమల.!

Publish Date:Jul 7, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని  అమరావతిలో తిరుమల  వెలుస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం  శ్రీకారం చుట్టింది.  రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలోని  శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ  260 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న భారీ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో నిర్మితం కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిపూజను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాస్త్రోక్తంగా నిర్వహించి  శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ   ప్రాజెక్టును కేవలం రెండున్నరేళ్ల కాలపరిమితిలోనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

ఈ   ప్రాజెక్టును మొత్తం రెండు విడతల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత పనుల కోసం  140 కోట్ల రూపాయలు కేటాయించారు.  మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన   ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా   ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు. వీటితో పాటు ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఆంజనేయస్వామి ఆలయం,  పుష్కరిణి , అలాగే ఆలయ పరిసరాల అంతటా సుందరమైన కట్-స్టోన్ ఫ్లోరింగ్ పనులను ఈ విడతలో పూర్తి చేయనున్నారు. అమరావతి నగరానికి వచ్చే భక్తులకు తిరుమల దివ్య క్షేత్రాన్ని దర్శించిన అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా ఈ నిర్మాణ శైలి ఉండ నుంది. 

ఇక రెండవ విడత పనుల కోసం రూ. 120 కోట్లను కేటాయించి భక్తుల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ఇందులో భాగంగా తిరుమల కొండ తరహాలోనే ఇక్కడ కూడా ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆలయానికి అనుసంధానంగా ఉండే ప్రధాన రహదారులను విస్తరించనున్నారు. వేలాది మంది భక్తులకు నిత్యం అన్నప్రసాద వితరణ చేసేందుకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన భారీ అన్నదానం కాంప్లెక్స్, అలాగే భక్తులకు   వసతి గృహాలు,  ఆలయ అర్చకులు,   ఇతర సిబ్బంది నివాస సముదాయాలను నిర్మించనున్నారు. 

వాస్తవానికి  2019 కంటే ముందే కృష్ణా నది తీరాన దాదాపు 25.4 ఎకరాల సువిశాల స్థలంలో తిరుమల ఆలయ ప్రతిరూపాన్ని నిర్మించాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి భూమిని కేటాయించింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తగ్గించి, పనులను దాదాపు నిలిపివేసింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను మళ్లీ వేగవంతం చేసి, అమరావతిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు ఈ భారీ విస్తరణ ప్రణాళికను పునరుద్ధరించారు. రాజధాని అమరావతిని దైవసంకల్పంతో కూడిన నగరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభివర్ణించారు.  

Amaravati TTD Temple, Sri Venkateswara Swamy Temple Amaravati, Chandrababu Naidu Temple Foundation

By
en-us Political News

  
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలి అడ్డాలో చిన్నారి బాలుడిపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల చర్యల కథనం.
హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్‌లోని ఒక ఓయో హోటల్ గదిలో యువతి దారుణంగా హత్యకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఒక ఆటో డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహం తరలింపు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు మరియు హత్యకు గల కారణాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దాడి చేసి, బస్సును అపహరించి రాంగ్ రూట్‌లో బీభత్సం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైరల్ అవుతున్న వీడియో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లెలి హత్యకు 6 నెలల తర్వాత పక్కా ప్లాన్‌తో 10 సెకన్లలో 9 సార్లు కత్తితో నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ రిベンజ్ మర్డర్ కేసు పూర్తి వివరాలు తెలుసుకోండి.
కర్ణాటక ఐపీఎస్ అధికారిణి డి. రూపా 20 ఏళ్ల సర్వీస్‌లో 40 బదిలీలు ఎదుర్కొన్నా భయపడకుండా అవినీతిపై పోరాడుతున్నారు. శశికళ జైలు కుంభకోణం, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలిచిన ఆమె నిజాయితీ సాహస గాథ ఇక్కడ చదవండి.
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.