సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఉక్కుపాదం.!

Publish Date:Jul 7, 2026

Advertisement

సోషల్ మీడియా వేదికగా వ్యవస్థీకృత దుష్ప్రచారానికి పాల్పడే వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, అశ్లీల పోస్టులు పెడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలకు ఒడిగట్టే శక్తులపై ఉక్కుపాదం మోపాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీతో కలిసి ఆమె అన్ని జిల్లాల ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, ఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై మంత్రి  అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి,  వ్యవస్థీకృత నేరగాళ్లను పట్టుకోవడానికి హోంమంత్రి కీలక సూచనలు చేశారు. ఫేక్ న్యూస్,  అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న నెట్‌వర్క్‌లను ఛేదించడానికి  నెట్‌వర్క్ ఆధారిత దర్యాప్తు ముమ్మరం చేయాలన్నారు. అలాగే..  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో  సైబర్ గార్డ్ యూనిట్లు,  సోషల్ మీడియా పర్యవేక్షణ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రిపీటెడ్ అఫెన్సెస్ కు పాల్పడే వారిపై,  సమాజంలో అభద్రతా భావాన్ని సృష్టించే వారిపై చట్టప్రకారం కఠిన  చర్యలు తీసుకోవాలని మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. అలాగే అదే సమయంలో అంటే.. వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు,  చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో సోషల్ మీడియా దుష్ప్రచారానికి సంబంధించి గత రెండేళ్లలో 1,665 కేసులు నమోదయ్యాయని,  హానికరమైన, అలాగే  అసత్య ప్రచారాలకు సంబంధించిన 12 వేల  వెబ్‌లింక్‌లను  సహయోగ్   ద్వారా ఇప్పటికే తొలగించినట్లు పోలీసు అధికారులు ఈ సందర్భంగా హోంమంత్రికి వివరించారు.రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాను వాడుకుంటే ఊపేక్షించేది లేదని, అవసరమైతే అసత్య ప్రచారాలను నియంత్రించడానికి ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఆలోచిస్తోందని మంత్రి చెప్పారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలి అడ్డాలో చిన్నారి బాలుడిపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల చర్యల కథనం.
హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్‌లోని ఒక ఓయో హోటల్ గదిలో యువతి దారుణంగా హత్యకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఒక ఆటో డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహం తరలింపు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు మరియు హత్యకు గల కారణాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దాడి చేసి, బస్సును అపహరించి రాంగ్ రూట్‌లో బీభత్సం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైరల్ అవుతున్న వీడియో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లెలి హత్యకు 6 నెలల తర్వాత పక్కా ప్లాన్‌తో 10 సెకన్లలో 9 సార్లు కత్తితో నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ రిベンజ్ మర్డర్ కేసు పూర్తి వివరాలు తెలుసుకోండి.
కర్ణాటక ఐపీఎస్ అధికారిణి డి. రూపా 20 ఏళ్ల సర్వీస్‌లో 40 బదిలీలు ఎదుర్కొన్నా భయపడకుండా అవినీతిపై పోరాడుతున్నారు. శశికళ జైలు కుంభకోణం, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలిచిన ఆమె నిజాయితీ సాహస గాథ ఇక్కడ చదవండి.
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.