'ఆర్ఆర్ఆర్' నాటు పాటతో జగన్ ను ఏకిపారేసిన టీడీపీ నేత
Publish Date:Dec 14, 2021
Advertisement
నా పాట సూడు.. నాటు నాటు నాటు.. సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’సినిమాలోని ఈ పాట ఇప్పుడు సూపర్ హిట్. వచ్చే ఏడాది రెండో వారంలో విడుదల కానున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. తారక్, చెర్రీలు పోటాపోటీగా నటించిన ఈ మూవీలోని ఒక నాటు పాట.. సోషల్ మీడియాలో రికార్డులను షేక్ చేస్తుండగా.. రాజకీయ నేతలకు ఆయుధంగా మారింది. ఘాటు పదాలతో విమర్శలు, ఆరోపణలు చేసే కన్న తెలివిగా పంచ్ లు వేసే ఏ అవకాశాన్ని ఎవరూ వదులుకోవటం లేదు పొలిటికల్ లీడర్స్. ఇందుకోసం తాజాగా ట్రెండింగులో ఉన్న అంశాలను వాడేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సూపర్ హిట్టైన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు పాటను తనకు అనుకూలంగా మలుచుకున్నారు టీడీపీ సీనియరే నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసేలా.. ‘నా పాట సూడు’ అంటూ తారక్.. చెర్రీలు చేసిన నాటు పాటకు ఆయన పేరడీని విడుదల చేశారు. ఏపీలోని జగన్ సర్కారు తీరును తప్పు పడుతూ ఈ పాటకు పేరడీ పాటను విడుదల చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అప్పులోళ్ల ఖాతాల్లో వడ్డీ రేట్లు పెరిగినట్లు.. పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజుఊగినట్లు.. నోటి బురద మాటలతో గుడివాడలోన ఎగిరినట్టు.. ప్రత్యేక హోదా నీడలోన రాజకీయం చేసినట్టు.. ఎన్నికల హామీలు కొండ ఎక్కించినట్టు.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. వేస్టు.. వేస్టు.. సుద్ధ వేసటు అంటూ సాగేలా పాటను మార్చిన వైనాన్ని బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ఈ పేరడి సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోరంట్ల ట్వీట్ కు నెటిజన్లు స్పందిస్తూ తమదైన కామెంట్లు పెడుతున్నారు.
http://www.teluguone.com/news/content/tdp-leader-target-cm-jagan-with-rrr-natu-song-39-128336.html





