రివర్స్ పీఆర్సీ.. అమరావతి రైతులకు రిలీఫ్.. కారు జోరు.. టాప్ న్యూస్@1PM

Publish Date:Dec 14, 2021

Advertisement

ప్రజా సమస్యలపై పోరాడటమే జీవీ ఆంజనేయులు చేసిన తప్పా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. తక్షణమే అక్రమ కేసులు ఉపసంహరించుకోని క్షమాపలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలే లక్ష్యంగా జగన్‌ పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధిని వదిలేసి ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసుల నమోదుకే సమయం వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. 
-------
దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ ఏపీలోనే చూస్తున్నామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఐఆర్ 27 శాతం ఉంటే... 14 శాతం ఫిట్మెంట్ చాలు అని నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. సీఎస్ కమిటీ నివేదిక ప్రభుత్వ సూచనల ఆధారంగానే ఇచ్చారని స్పష్టం అవుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 43 శాతం కావాలి అని అడిగామని... ఇబ్బందులు ఉన్నా ఇచ్చారని తెలిపారు. జీతాలు పెంచమని అడిగితే... తగ్గిస్తామని అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
--
తిరుమల శ్రీవారిని దర్శించుంకునేందుకు అమరావతి రైతులకు టీటీడీ అనుమతిని ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని టీడీపీ తెలిపింది.  అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ  రైతులు మహా పాదయాత్రను చేపట్టారు.  నవంబర్ 1న తుళ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభమవగా... 17న తిరుపతిలో పాదయాత్ర ముగియనుంది. కోర్టు అనుమతితో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. 
------
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయి.  తాజాగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి బయటికి వచ్చారు. కడప ఎస్పీ అన్బురాజన్ కలిసి తనకు తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు బామ్మర్ధి శివప్రకాష్ రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పీఏ కృష్ణారెడ్డి పేర్కొనడం సంచలనమైంది. 
-----
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. ఈపూరు మండలం ముప్పాళ్ళ లోఎస్సీ కాలనీలో మోసపోయిన వైసీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ వెలసింది. ఎస్సీలను ఎన్నికలలో ఓట్లు కోసం వాడుకున్నారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను వదిలేశారని ఫ్లెక్సీలో రాశారు. తమను అవమానపర్చిన వారికి తగు రీతిలో సమాదానం చెబుతామని, వైసీపీ నేతలు తమ కాలనీ జోలికి వస్తే గాడిదలతో సమానంగా ఆడవాళ్లుతో బుద్ధి చెప్పిస్తామంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. 
-----
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు పోలింగ్ జరగగా... కౌంటింగ్ లో ఆరు సీట్లను కారు పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా ఎన్నిక సాగిందని ప్రచారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 
-----
తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం మోగుతోందని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ట్వీట్టర్ వేదికగా ఎంపీ స్పందిస్తూ.... ‘‘రుణమాఫీ లేదు, పంటను కొనే నాథుడు లేడు, అమ్మిన పంట సొమ్ముల కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తోన్న దౌర్భాగ్య పరిస్థితి. ఇంటి ముందు అప్పులోడి లొల్లి. సమస్య పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి తీర్థయాత్రలు, రాజకీయ భేటీలతో బిజీగా ఉన్నాడు’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
------
శిల్పా చౌదరి ఆర్థికమోసం కేసు డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. ఆమెను పోలీసులు ఇప్పటికే రెండు పర్యాయాలు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయినా కేసు  కొలిక్కి రాకపోవడంతో.. తాజాగా మూడోసారి ఉప్పర్‌పల్లి కోర్టు శిల్పాచౌదరిని మరో రోజు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.మంగళవారం ఉదయం 10 గంటలకు శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకొని.. అదే రోజు సాయంత్రానికి తిరిగి చంచల్‌గూడ జైల్లో అప్పగించనున్నారు.
---
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం బీఎల్‌డబ్ల్యూ గెస్ట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల పనితీరును ఈ సమావేశంలో ప్రధాని సమీక్షించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల పురోగతికి సంబంధించి సీఎంలు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
---
 జమ్మూకశ్మీర్ విషయంలో పదేపదే పాక్ జపం చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూటి సలహా ఇచ్చారు. ''మీకు పాక్ పట్ల మరీ అంత ముచ్చట ఉంటే అక్కడకు వెళ్లి స్థిరపడొచ్చు'' అని అన్నారు.
 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.