స్వోత్కర్ష: పరనింద.. జగన్ కు తెలిసిందిదేనా.?

Publish Date:Nov 6, 2026

Advertisement

ఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ అనడంలో సందేహం లేదు. అలాగే గురువారం (నవంబర్ 5) జరిగిన పరిషత్ ఎన్నికలలో కూడా వైసీపీ చేతులెత్తేసినట్లేనని జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరును బట్టి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కింద పడ్డా పై చేయి నాదేనని చాటుకోవడానికి జగన్ పడుతున్న తాపత్రేయం ఆయన  ఓటమిని అంగీకరించేశారనడానికి నిదర్శనంగా వారు చూపుతున్నారు.  

పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 

గత రెండేళ్లుగా అంటే 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణ ఓటమి తరువాత నుంచీ ఏం చెబుతున్నారో, తాజాగా స్థానిక సమరంలో ఓటమి తరువాతా అదే చెప్పారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలలో అధికార పార్టీ యంత్రాంగం అక్రమాలకు పాల్పడిందని, నిబంధనలను తుంగలో తొక్కి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు  అడ్డదార్లు తొక్కిందనీ   ఆరోపించారు. అదే సమయంలో తన హయాంలో 2021లో జరిగిన స్థానిక ఎన్నికల గురించి లేశమాత్రమైనా ప్రస్తావించలేదు. 


మునిసిపోల్స్ లో  ప్రజాతీర్పును అంగీకరించే సాహసం చేయలేని జగన్.. మొత్తంగా ఎన్నికల ప్రక్రియపైనే బురద జల్లే ప్రయత్నం చేశారు.   అసలు ఇవి  ఎలక్షన్లే కావని, ఇవన్నీ కేవలం సెలక్షన్లు మాత్రమేనంటూ  వితండ వాదానికి తెరలేపారు.  తన హయాంలొ   నామినేషన్లు కూడా వేయనివ్వకుండా బలవంతపు ఏకగ్రీవాలతో అరాచకం సృష్టించిన చరిత్రను కన్వీనియెంట్ గా మరిచిపోయారు. 

ఇది కూడా చదవండి:  నేను గానీ, ఒక్క సైగ గానీ చేస్తే.. ప్రత్యర్థులకు జగన్ వార్నింగ్.!

ఇక తాజాగా జగన్ గురువారం (నవంబర్ 5) మీడియా సమావేశంలో మాట్లాడిన దానిని బట్టి, ఓటమి తప్పదన్న నిర్ణయానికి ముందే వచ్చేసి, ఆ ఒటమి నెపాన్ని పోలీసులు, ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై నెట్టేసి నైతిక విజయం తమదేనని చెప్పుకోవడానికి వృధా ప్రయత్నం చేశారని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పరిషత్ ఎన్నికలలో కనీసం పరువు దక్కే అవకాశాలే లేవన్న అంచనాతో జగన్ బెదరింపులకు తెగించారు.  నిరాశా వాదం, నిర్హేతుక వాదనలతో జగన్ తన ప్రెస్ మీట్ ముగించారు.

మొత్తంగా స్థానిక సమరంలో పార్టీ పరాజయానికి అధికార తెలుగుదేశం కూటమి కారణమంటూ నెపాన్ని నెట్టేసి, ప్రెస్ మీట్ మొత్తాన్నిస్వోత్కర్ష, పరనిందలకు పరిమితం చేశారు. కాగా ఓ వైపు జగన్ ప్రభుత్వ అధికార దుర్వినియోగం పై ప్రసంగిస్తుంటూ.. స్థానిక ఓటమిని శిరసావహిస్తున్నామనీ, వైసీపీపై ప్రజా వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనమనీ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరో ప్రెస్ మీట్ లో కుండబద్దలు కొట్టారు. పార్టీ తీరు ఇలాగే ఉంటే ఏ ఎన్నికలోనైనా ఇదే ఫలితం పునరావృతమౌతుందనిఅంగీకరించారు.  

మీకు నచ్చవచ్చు:

 [Jagan Press Meet on Municipal Results, Parishad Polls, Andhra Pradesh Political News, Telugu One]  

By
en-us Political News

  
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.