చంద్రబాబుకి ఎన్టీఆర్ స్తుతే గతి!
Publish Date:Oct 4, 2012
Advertisement
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు ఇంకా ప్రజల గుండెల్లోనే దాగి ఉన్నారు. ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈయన్ని తలుచుకుంటూనే ఉంటారు. ఇంకా కొన్ని గిరిజన తెగలైతే రాముడు, కృష్ణుని పాత్రల్లో ఉన్న ఎన్టీఆర్ పటాన్ని పూజామందిరంలో ఉంచుకున్నారు. అలానే ఎన్టీఆర్‌ను హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలు బాగా ఆదరించారు. ఇప్పటికీ ఆయన అంటే అభిమానాన్ని చూపే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీకోసం వస్తున్నా పాదయాత్రను ప్రారంభించారు. దీంతో ఈ నియోజకవర్గంలో తన బలాన్ని పెంచుకునేందుకు జనాన్ని ఆకర్షించేందుకు బాబు ఎన్టీఆర్‌ను స్తుతించారు. ‘‘ ఎన్టీఆర్ నడయాడిన నేల ఈ గడ్డ. నాకు ఈ ప్రాంతమంటే ఎంతో అభిమానం. అందుకే ఆయన ఆశయాల్లోనే నేను నడుస్తాను. ’’ అని చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌పై అభిమానంతో తాను ఈ ప్రాంత అభివృద్థికి తన వంతు కృషి చేస్తానని కూడా భరోసా ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/tdp-founder-24-17902.html





