అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదు

Publish Date:Oct 31, 2014

Advertisement

 

విద్యుత్ సంక్షోభంతో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా తక్షణమే స్పందించి వారికి భరోసా కల్పించి, అందుకు నివారణ చర్యలు చెప్పట్టకపోగా ఈ విద్యుత్ సంక్షోభానికి ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కరెంటు లేక కాళ్ళ ముందే పంటలు ఎండిపోతుంటే, అప్పుల భయంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకొంటుంటే మరో మూడేళ్ళు ఓపిక పట్టండి విద్యుత్ సంక్షోభాన్ని పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇస్తున్నారు. విద్యుత్ సంక్షోభంతో రాష్ట్రం విలవిలలాడుతుంటే, తక్షణమే డిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసి జాతీయ గ్రిడ్ నుండి అదనపు విద్యుత్ పొందే ప్రయత్నాలు గట్టిగా చేయకపోగా, ఆపని చేసిన తెలంగాణా తెదేపా యంపీ, యం.యల్యే.లను విమర్శిస్తున్నారు.

 

తెదేపా సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ గుండు సుధారాణి తదితరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిల్లీలో ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావుతో నేతృత్వంలో కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్, కలిసి తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం దాని వలన ఎండిపోతున్న పంటలు, నానాటికి పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు వంటి పరిస్థితులన్నీ వివరించి తక్షణమే కేంద్ర గ్రిడ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి అదనపు విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసారు. ఆ తరువాత వారందరూ కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధా మోహన్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు మరియు వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ లను కూడా కలిసి పరిస్థితి వివరించి తెలంగాణా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.

 

తెలంగాణా ప్రభుత్వం తరపున ఎవరూ వెళ్లి కేంద్రంతో మాట్లాడి అదనపు విద్యుత్ పొందే ప్రయత్నం చేయకపోయినా, అందుకోసం వెళ్ళిన తెదేపా నేతలపై విరుచుకు పడుతున్నారు. “తెదేపా నేతలు మా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే పనిగట్టుకొని డిల్లీ వెళ్ళారు తప్ప తెలంగాణా రాష్ట్రానికి కేంద్ర సహాయం కోరేందుకు కాదు” అని తెరాస యంపీ జితేందర్ రెడ్డి అనడం చూస్తే అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదన్నట్లుంది. తెలంగాణా ప్రభుత్వమే చొరవ తీసుకొంటే మేమెందుకు డిల్లీ వెళతామని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికయినా తెలంగాణా ప్రభుత్వం మేల్కొని అన్ని పార్టీల ప్రతినిధులను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అదనపు విద్యుత్ పొందే ఆలోచన చేస్తే బాగుంటుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

 

By
en-us Political News

  
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.