అండర్ గ్రౌండ్ కరెంట్ షాక్ కొడుతుంది.!

Publish Date:Aug 12, 2026

Advertisement

వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి వ్యాఖ్యలు సర్వత్రా వైరల్ అవుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్.. ఎక్కడ చదివారో, ఎలా పాస్ అయ్యారో అనే అనుమానాలు కలిగేలా ఆయన మాటలు ఉన్నాయి.  అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది.

అందులో భాగంగానే నగరంలో ఎక్కడా పైకి కరెంట్ వైర్లు, విద్యుత్ స్తంభాలు కనిపించకుండా, అండర్ గ్రౌండ్ కేబులింగ్  వ్యవస్థను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అంతర్జాతీయ నగరాల తరహాలో అమరావతి వీధుల కింద విద్యుత్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం డక్ట్ సిస్టమ్‌ను నిర్మించారు. ఈ సాంకేతిక అంశాలపై కనీస అవగాహన లేకుండా తాటిపర్తి చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన పరువును నిండా తీయడమే కాకండా వైసీపీని నవ్వుల పాలు చేశాయి. 

అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు. మొత్తంగా వైసీపీయులు తమ అమరావతి వ్యతిరేకతను దాచుకోవడానికి ఇసుమంతైనా ప్రయత్నించకుండా ఇష్టారీతి వ్యాఖ్యలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఆ క్రమంలోనే  అమరావతి అండర్ గ్రౌండ్ పవర్ గ్రిడ్ నెట్‌వర్క్ అంటే ఏమిటో కూడా తెలియని అజ్ణానంతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్  చేసిన వ్యాఖ్యలతో తెగ ట్రోలింగ్ కు గురౌతున్నారు. 

 ఇటీవల మీడియాతో మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్ అమరావతిపై విమర్శలు గుప్పిస్తూ.. అడ్డంగా బుక్కయ్యారు. తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులలో  తప్పులను చూపడమే లక్ష్యంగా సాగిన ఆయన ప్రెస్ మీట్ లో దేశంలోనే ఫ్రీ పోల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో విద్యుత్ స్తంభాలను అండర్ గ్రౌండ్ లో పెడితే.. జనాలకు షాక్ కొట్టదా అంటూ ప్రశ్నించి, ఈ విధానాన్ని ఖండిస్తున్నానంటూ గంభీరమైన స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఒకవేళ ఈ విషయం మీద అవగాహన ఉండి ఉంటే తాటిపర్తి చంద్రశేఖర్ మరో విధంగా మాట్లాడి ఉంటే బాగుండేది. అలాకాకుండా కరెంటు పోల్స్ అండర్ గ్రౌండ్ లో పెడితే.. జనాలకు కరెంట్ షాక్ కొట్టదా.. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాను అంటూ దేన్ని ఎందుకు ఖండిస్తున్నారో కూడా తెలియకుండా గంభీరమైన స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దీంతో నెటిజనులు తాటిపర్తి చంద్రశేఖర్ విజ్ణాన ప్రదర్శన అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

Tatiparthi Chandrasekhar, YSRCP MLA, Amaravati Underground Power Lines, Chandrababu Naidu, AP Politics,   TeluguOne

By
en-us Political News

  
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.