పులివెందులలో తుస్సు మన్న వైసీపీ నిరసనలు.!

Publish Date:Aug 12, 2026

Advertisement

వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నిరసనలు తుస్సుమన్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది.  ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి. జగన్ కు పెట్టని కోట అయిన పులివెందులతో వైసీపీ నిరసనలకు జనం నుంచి స్పందన కరవైంది. అలాగే డీఎస్సీ అభ్యర్థులూ ఈ నిరసనలను పట్టించుకోలేదు.  దీంతో జన సమీకరణ కోసం వైసీపీ స్థానిక నేతలు నానా తంటాలూ పడ్డారు.   పులివెందులలోని ప్రైవేట్ కాలేజీల  విద్యార్థులను బలవంతంగా నిరసన ర్యాలీలకు తరలించారు. 

ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే   విద్యార్థులను రాజకీయ ఆందోళనల్లోకి లాగడంపై తెలుగుదేశం పార్టీ  ఖండించింది. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ విషయంపై మాట్లాడుతూ... వైసీపీ నిర్వహించిన మెగా డీఎస్సీ  వ్యతిరేక నిరసనల కోసం ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ర్యాలీలకు పంపడాన్ని  తప్పుపట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి సదరు ప్రైవేటు కాలేజీ వద్దకు చేరుకున్న బీటెక్ రవి, కాలేజీ యాజమాన్యాన్ని నేరుగా నిలదీశారు.  రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని   ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసనల్లో ఒకవేళ లాఠీచార్జ్ లేదా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగి విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఆ బాధ్యత ఎవరిదని నిలదీశారు. 
విద్యార్థులను రాజకీయ నిరసనలకు పంపినందుకు యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులను ఆందోళనలకు తీసుకురావాలని ఒత్తిడి చేసిన వైర్‌సీపీ నేతలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు.   డీఎస్సీ 2025కి అనుకూలంగా కాలేజీ ఫ్యాకల్టీతో కలిసి ర్యాలీ నిర్వహించాలన్నారు.   వైసీపీకి తిరుగులేని ప్రాబల్యం ఉన్న పులివెందులలో, ఎంపీ అవినాష్ రెడ్డి పర్యవేక్షించే పరిధిలో టీడీపీ నేత బీటెక్ రవి ఈ స్థాయిలో   నిలదీయడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

BTech Ravi Pulivendula, YSRCP DSC 2025 protest, Pulivendula TDP viral video, AP DSC controversy 2025, BTech Ravi warning private college, Kadapa Pulivendula politics 

By
en-us Political News

  
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.