మిస్ యూనివర్స్ 2026 విజేతగా జెన్నిఫర్ బారెటో..తొలి వివాహితగా చరిత్ర.!

Publish Date:Nov 25, 2026

Advertisement

ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది. తొలిసారిగా వివాహిత, ఒక బిడ్డకు తల్లి అయిన మహిళ విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్‌లో నిర్వహించిన 75వ మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో ఆతిథ్య దేశానికి చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచారు.

మొత్తం 116 దేశాల పోటీదారులతో హోరాహోరీగా సాగిన ఈ వేడుకలో, ఏడేళ్ల కుమార్తెకు తల్లి అయిన జెన్నిఫర్ తన ఆత్మవిశ్వాసంతో న్యాయనిర్ణేతలను మెప్పించారు. మానసిక ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో పనిచేస్తున్న ఆమె, సైనిక కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రివెన్షన్ స్పెషలిస్ట్‌గా సేవలందిస్తున్నారు. సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలు కలిగిన ఆమె విజయం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఈ విజయంతో ప్యూర్టోరికో ఖాతాలో ఆరో మిస్ యూనివర్స్ కిరీటం చేరింది. 2006లో జులేకా రివెరా తర్వాత ఆ దేశానికి దక్కిన తొలి టైటిల్ ఇది కావడం విశేషం. స్వదేశంలో జరిగిన పోటీల్లో ప్యూర్టోరికో సుందరి విజేతగా నిలవడం ఇది రెండోసారి. మరోవైపు, భారత్ తరపున బరిలోకి దిగిన కజియా లిజ్ మెజో టాప్ 30 వరకు చేరుకున్నప్పటికీ తదుపరి దశకు అర్హత సాధించలేకపోయారు.

దశాబ్దాల పాటు మిస్ యూనివర్స్ పోటీల్లో కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. పెళ్లయిన మహిళలు, తల్లులకు ఈ వేదికపై అవకాశం ఉండేది కాదు. అయితే 2023 నుంచి అర్హత నిబంధనలను సవరించడంతో వివాహితులు, తల్లులు కూడా పోటీల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.

ఇది కూడ చవండి: చిన్న ఇస్త్రీ షాపు నుంచి లక్షల టర్నోవర్ దాకా..ముంబయి యువకుడి సక్సెస్ స్టోరీ.!

ఈ మార్పు తర్వాత గత కొన్నేళ్లుగా పలువురు తల్లులు అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను చాటుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా వివాహిత, తల్లి అయిన జెన్నిఫర్ విజేతగా నిలవడంతో, అందాల పోటీల నిర్వచనంపై ప్రపంచవ్యాప్తంగా సానుకూల చర్చ జరుగుతోంది. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కలలను సాకారం చేసుకోవచ్చనే సందేశం ఈ గెలుపుతో బలపడింది.

రాబోయే రోజుల్లో ఇతర అంతర్జాతీయ అందాల పోటీలు కూడా ఇదే తరహా సంస్కరణల వైపు అడుగులు వేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత లక్ష్యాల మధ్య సమతూకం సాధించే మహిళలకు ఈ విజయం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మీకు నచ్చవచ్చు: సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్ క్షమాపణలు ఎందుకంటే.!

మీకు నచ్చవచ్చు: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ చేంజ్.. సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.!

[ Jennifer Barreto, Miss Universe 2026, First married woman Miss Universe, Puerto Rico Miss Universe, Beauty pageant rules change ]

By
en-us Political News

  
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
పిల్లల కేరింతలు.. ఆటపాటలు.. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
కుటుంబాలను పోషించేందుకు రోజూ పనికి వెళ్లిన ఆ ముగ్గురు కార్మికులకు అదే పని చివరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.!
నడవడానికి కేటాయించిన ఫుట్‌పాత్‌పై కూడా ప్రశాంతంగా అడుగులు వేయలేని పరిస్థితి.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు ఏకంగా పాదచారుల దారినే ఆక్రమిస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడం ఆభరణాల కొనుగోలుదారులకు ఊరటనిస్తుంటే.. పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.