రహదారి విస్తరణ కోసం ఆలయం తొలగింపు: వైసీపీ నీచ రాజకీయం!
Publish Date:Nov 25, 2026
Advertisement
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని పురాతన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ తొలగింపు అంశంపై వైసీపీ రాజకీయ డ్రామాకు తెరలేపింది. జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం ఈ ఆలయాన్ని కూల్చివేశారంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హేరామ్ సేవ్ టెంపుల్స్ అంటూ షేర్ చేసిన పోస్టుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. వాస్తవానికి రహదారి విస్తరణకురేణిగుంట మండలం పురాతన అభయాంజనేయ స్వామి ఆలయ భూసేకరణ ప్రక్రియ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ ఆధారాలతో సహా వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భూమి అప్పగింతకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని, అప్పుడే పరిహారాన్ని కూడా నిర్ణయించారని ఆమె గుర్తుచేశారు. అంతే కాకుండా, ఈ ఆలయ తరలింపు ప్రక్రియ గ్రామస్థులు, భక్తుల సమ్మతితోనే శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ నిర్మాణం కోసం అక్కడకు సమీపంలోనే 50 సెంట్ల ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించడంతో పాటు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఖాతాలో 59.3 లక్షల పరిహార నిధులను కూడా అధికారులు జమ చేశారు. ఇది కూడా చదవండి: ఏపీలో ఆగని దాడులు.. మరో ఆలయంలో విగ్రహాల ధ్వంసం! దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పర్యవేక్షణలో, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ప్రత్యామ్నాయ స్థలంలో బాలాలయం నిర్మించి, మూలవిరాట్టు విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాతే పాత నిర్మాణాలను తొలగించారు. తన ప్రభుత్వ హయాంలో జరిగిన భూసేకరణ ఒప్పందాలను పక్కనపెట్టి, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా జగన్ ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మీకు నచ్చవచ్చు: శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం! [Controversy, Anjaneyapuramtemple: Nationalhighway, YCP, Politics, Jagantweet, TeluguOne]
http://www.teluguone.com/news/content/controversy-25-237944.html





