వరంగల్ లో చక్రం తిప్పుతున్న పొన్నాల కోడలు?

Publish Date:Apr 26, 2012

Advertisement

రాష్ట్ర ఐటిశాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య కోడలు పొన్నాల వైశాలి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగారితో ఏ పనైనా జరగాలంటే ముందుగా వైశాలిని ప్రసన్నం చేసుకుంటే చాలుననే స్థాయివరకూ ఆమె ఎదిగారు. ప్రస్తుతం ఆమె మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె ఇప్పుడు డిసిసి అధ్యక్షపదవిపై కన్నేసినట్లు తెలిసింది. ఆమె ప్రయత్నాలకు మామ పొన్నాల లక్ష్మయ్య ఆశీస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మహిళకు డిసిసి అధ్యక్షపదవి అప్పగిస్తే తొలిసారిగా మహిళకు అవకాశమిచ్చిన ఘనత దక్కుతుందని పొన్నాల లక్ష్మయ్య అంటున్నట్లు తెలుస్తోంది.

 

 

ఆమెను డిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తే ఈ జిల్లాలో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని, ఆమెకు ఎవరితోనూ ఏటువంటి విభేదాలు లేవని లక్ష్మయ్య అంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పదవిని ఆశిస్తున్న దుగ్యాల శ్రీనివాసరావు, దొంతి మాధవరెడ్డి, రాజవర్తనరెడ్డి, వైశాలి ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఏనాడూ పార్టీ అభివృద్ధికి కృషి చేసింది లేదని, ఇప్పుడు ఆయన తన కోడలిని రంగంలోకి దింపి పార్టీని మరింత బలహేనపరిచేందుకు ప్రయత్నిస్తునారని వారు అంటున్నారు. తెలంగాణలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వివాదాలకు తావులేకుండా డిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిస్థానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
వంద రోజుల్లో హామీల అమలుపై బీఆర్‌ఎస్‌ వ్యంగ్యాస్త్రాలు..!
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్..!
ఓ తల్లి స్నానం కోసం వేడి చేస్తున్న నీళ్లు.. అదే ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి పాలిట ప్రాణాంత కంగా మారాయి.
చోరీ వెనుక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. రెజిమెంట్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం..?
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక మలుపు చోటుచే సుకుంది.
త్వరలో కొత్త యాజమాన్యం కార్యకలాపాలు..?
23 సంస్థలకు నోటీసులు, మూడు సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమ చర్యల అమలు దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఢిల్లీకి బయల్దేరారు.
హైదరాబాద్ నగరంలోని లాలాగూడ ప్రాంతంలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.