శ్రీసిటీలోరూ.1,740 కోట్ల పెట్టుబడి
Publish Date:Jan 13, 2012
Advertisement
హైదరాబాద్ : శ్రీసిటీ సెజ్‌లో సుమారు 1,740 కోట్ల రూపాయల పెట్టుబడులతో కొత్తగా మరో 14 పరిశ్రమలు రాబోతున్నాయి. ఈపరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సిటీ సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చెప్పారు. సెజ్‌లో పెట్టుబడులు పెట్టనున్న కంపెనీలన్ని మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలని ఆయన తెలిపారు. భాగస్వామ్య సదస్సు 2012 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు (ఎంఒయు) కుదుర్చుకోనుందని ఆయన తెలిపారు.శ్రీ సిటీలోని 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీల్లో తొలి దశలో సుమారు 2,800 మందికి ఉపాధి లభించనుందని రవీంద్ర చెప్పారు.
జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కె స్ప్రింగ్ (రూ.300 కోట్లు), యునీచార్మ్ (రూ.250 కోట్లు), ఇండియా మెటల్ వన్ (రూ.200 కోట్లు)లతో పాటు లావాజ్జా (రూ.170 కోట్లు, ఇటలీ), ఆల్‌స్టోమ్ (రూ.140 కోట్లు, ఫ్రాన్స్), హంటర్ డగ్లస్ (రూ.50 కోట్లు, నెదర్లాండ్స్), చేత్రా (రూ.41 కోట్లు, రష్యా), బెర్గన్ పైప్ (రూ.24 కోట్లు,యుకె), ఈగల్ బర్మన్ (రూ.20 కోట్లు, డెన్మార్క్), ఎవర్టాన్ (రూ.9 కోట్లు,ఇటలీ)లుండగా భారత్‌కు చెందిన ఆస్ట్రోటెక్ స్టీల్స్ (రూ.41కోట్లు), ఫ్రీవరల్డ్ (రూ.33 కోట్లు), టెక్‌ప్రో (రూ.12 కోట్లు) కంపెనీలు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఒయులు కుదుర్చుకోనున్నాయి. వీటితో పాటు ఇటలీకి చెందిన డానియెలి (రూ.300 కోట్లు),
కోబెల్కో (రూ. 131 కోట్లు) ప్లాంట్ల ఏర్పాటుకు ఉత్వర్వులు జారీ చేయనున్నారు.
http://www.teluguone.com/news/content/sricity-24-10922.html





