దొరకని ఆజాద్ అపాయింట్మెంట్
Publish Date:Jan 12, 2012
Advertisement
న్యూఢిల్లీ:కిరణ్ కేబినెట్లో పీఆర్పీ సూరీడుకు చెందిన రామచంద్రయ్యను తీసుకునే విషయంలో కడప కాంగ్రెస్ పార్టీ నేతలు చిరంజీవి వర్గానికిబాహాటంగా వ్యతిరేకించారు. అంతేకాదు దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాంనబీ ఆజాద్‌ను కలిసి సి.రామచంద్రయ్యను తీసుకోరాదని గట్టిగా వాదించేందుకు వెళ్లారు.కానీ వారికి ఆజాద్ అపాయింట్మెంట్ దొరకలేదు. అయినప్పటికీ ఆజాద్‌తో సమావేశమై తాము అనుకున్నది చెప్పేయాలని పట్టువదలని విక్రమార్కుల్లా అక్కడే వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనాలంటే సీఆర్‌కు బదులు మరో నేతకు ఇవ్వాలని వారు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సైతం సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టారు. మొన్నగాక నిన్న పార్టీలోకి వచ్చిన పీఆర్పీకి మంత్రి పదవులిస్తే మరి మా సంగతేంటి అని వారు నిలదీస్తున్నారు.ఒకవేళ మంత్రివర్గ విస్తరణే కనుక జరిగితే తెలంగాణ ప్రాంతానికి రెండు మంత్రి పదవులను కేటాయించాలని పట్టుబడుతున్నారు. మరి చిరంజీవి వర్గానికి అనుకున్నట్లుగా చివరికి మంత్రిపదవులు దక్కుతాయా, లేదా అనేది చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/ghulam-nabi-azad-24-10920.html





