కొందరు అధికారుల తీరు.. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారు!
Publish Date:Mar 14, 2025
.webp)
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు కూడా అన్నీ బాగా ఉన్నా కూటమి సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారుల పట్ల ఉదాశీనంగా ఎందుకు ఉంటోందన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాలనాయంత్రాంగంపై పట్టు కోల్పోయిందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కొందరు అధికారుల తీరు కూటమి సర్కార్ ప్రతిష్ఠ మసకబారేలా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అధికారులపై నియంత్రణ లేకుండా పోయిదా అన్న భవం కలిగేలా కొందరుర అధికారుల తీరు ఉంటోంది.
తాజాగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి అధికారులపై నియంత్ర లేదన్న భావన వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో అధికారులు ఆయా శాఖల మంత్రులను కూడా లేక్క చేయకుండా వ్యవహరించిన ఉదంతాలపై రాష్ట వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకటి రెండు శాఖలని కాకుండా పీఎంవో సహా దాదాపు అన్ని శాఖల్లోనూ కొందరు అధికారుల వ్యవహార శైలి కూటమి సర్కార్ కు చెడ్డ పేరు తీసుకువచ్చేలా, ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచేలా ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కాంట్రాక్టర్లతో వ్యవహరించిన తీరుపై సెక్రటేరీయేట్, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.
బిల్లుల బకాయిలపై మాట్లాడేందుకు తన వద్దకు వచ్చి విజ్ణప్తి చేసిన కాంట్రాక్టర్లతో పియూష్ కుమార్ దురుసుగా
కాంట్రాక్టుల్లో లాభాలు వచ్చినప్పుడు బానే తీసుకున్నారు కదా? ఇప్పుడు బిల్లుల కోసం కొంత కాలం వేచి చూడలేరా అంటూ మండిపడ్డారట. ప్రజలకు, ప్రభుత్వానికీ వారథులుగా ఉండాల్సిన అధికారి ఇలా వారి మధ్య అగాధం సృష్టించేలా మాట్లాడటమేమిటన్న విస్మయం వ్యక్తం అవుతోంది. పియూష్ కుమార్ తీరు వల్ల ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజీ అయ్యిందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. ఈ సందర్భంగానే పీయూష్ కుమార్ గతంలో చేసిన నిర్వాకాలను కూడా గుర్తు చేసుకుంటున్నాయి.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలోనే పులివెందులకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరిపేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు కాంట్రాక్టర్లకు ఎలా చెల్లింపులు జరుపుతారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు నిశ్శబ్దంగా ఆమోద ముద్ర వేసింది పియూష్ కుమారే అని తరువాత తేలింది. సాంకేతిక తప్పిదంగా పీయూష్ కుమార్ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు. అలాగే రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్ కు సంబంధించి వేరు బి్ల్లుల హడావుడి చెల్లింపుల వెనుక కూడా పీయూష్ కుమారే ఉన్నారని తేలింది. ఇలా పియూష్ కుమార్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబార్చడం, వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పని చేస్తాన్నారా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇక సీఎంఓలోని ఒకరిద్దరు ఉన్నతాధికారుల అండతో పీయూష్ ఆర్థిక శాఖను తన ఇష్టం వచ్చిన రీతిలో నడుపుతున్నారన్న ఆరోపణలు ప్రభుత్వ వర్గాల నుంచే వస్తున్నాయి.
ఒక్క పియూష్ కుమార్ అనే కాకుండా మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ కూడా తమతమ శాఖలలో కొందరు ఉన్నతాధికారుల తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఇటువంటి అధికారులపై అధికారులపై చర్యలు తీసుకోకుండా ఇంకా ఉపేక్షిస్తే ప్రభుత్వ ప్రతిష్ట, వ్యక్తిగతంగా చంద్రబాబు ప్రతిష్ట కూడా మసకబారుతుందని తెలుగుదేశం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/some-officers-bring-headache-to-kutami-25-194399.html












