Publish Date:Mar 13, 2025
జగన్ హయాంలో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం సందర్శనతోనే ప్రారంభించారు. తద్వారా పోలవరం ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను చాటారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
చంద్రబాబు కృషి కారణంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు వెల్లువెత్తుతున్నాయని చెప్పిన ఆయన ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టుకు 5052 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా వచ్చాయన్నారు. జగన్ హయాంలో కేంద్రం విడుదల చేసిన పోలవరం రీయింబర్స్‌మెంట్ నిధులను దారి మళ్లించిందనీ, ప్రాజెక్టు పనులను పక్కనపెట్టేసి పోలవరంను నిర్వీర్యం చేసిందనీ రామానాయుడు విమర్శించారు. ప్రస్తుతం పోలవరం పనులను కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో పరుగులు పెట్టిస్తోందని వివరించారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసేలా, డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామని తెలిపారు.
డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం రెండు కట్టర్లను ఉపయోగిస్తూ.. 136 మీటర్ల పొడవున, 6700 చదరపు మీటర్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఏప్రిల్ మొదటివారం నుంచి డి వాల్ నిర్మాణానికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం 990 కోట్ల రూపాయలను ఒకే విడతగా వారి వారి ఖాతాల్లో జమచేసిందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/polavaram-will-be-completed-by-2027-25-194357.html
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.