ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్.. ప్లేయర్లకు కాదు.. అంపైర్లకు జరిమానా!

Publish Date:Apr 17, 2026

Advertisement

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన   ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లకు స్లో ఓవర్ రేట్ ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. నిర్ణీత సమయం కంటే గంటల తరబడి మ్యాచ్ లు కొనసాగుతూ ఉండడానికి, ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారడానికి స్లో ఓవర్ రేట్ కారణమంటున్నారు క్రికెట్ పండితులు.  స్లో ఒవర్ రేట్ కు ప్లేయర్లకు జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదంటున్నది  మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ. ఎంసీపీ క్రికెట్ విభాగం అధిపతి ఫ్రేజర్ స్టీవర్ట్  అయితే.. స్లో ఓవర్ రేట్ సమస్యకు ఆటగాళ్లను మాత్రమే బాధ్యులను చేయడం  కాదని, దీనికి అంపైర్లను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. 


ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సుమారు 4 గంటల 22 నిమిషాల పాటు సాగింది. ఈ మ్యాచ్‌ను స్వయంగా వీక్షించిన స్టీవర్ట్.. ఆట సాగిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫీల్డింగ్ మార్పులు, ఆటగాళ్ల మధ్య చర్చలు, అనవసర విరామాల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.  ఈ నేపథ్యంలోనే ముంబైలో జరిగిన  ఒక కార్యక్రమంలో  మాట్లాడిన ఆయన.. అంపైర్ల ఉదాశీనత వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ నమోదైతే కేవలం జట్టు కెప్టెన్లకు లేదా ఆటగాళ్లకు మాత్రమే జరిమానా విధిస్తున్నారు. కానీ మైదానంలో నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయంలో మ్యాచ్ ముగిసేలా చూడాల్సిన బాధ్యత ఉన్న అంపైర్లకు కూడా జరిమానా విధించితేనే ఈ సమస్య పరిష్కారమౌతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 నియమావళిలో ఆట వేగాన్ని మందగింప చేసేలా వ్యవహరిస్తున్న ఆటగాళ్లకు, జట్లకు హెచ్చరికలు చేసే అధికారం, ఐదు పరుగుల పెనాల్టీ విధించే అధికారం, అవకాశం అంపైర్లకు ఉందనీ, వారు మాత్రం ఆ అధికారాన్నీ, అవకాశాన్ని ఉపయోగించకుండా ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే స్లో ఓవర్ రేట్ సమస్య తలెత్తుతోందని ఫ్రేజర్ స్టీవర్ట్  విమర్శించారు. అంపైర్లు కఠినంగా వ్యవహరించనంత కాలం మ్యాచ్‌లు ఇలాగే సాగుతాయని, ఒకవేళ ఓవర్ రేట్ తగ్గితే అంపైర్ల వేతనంలో కోత విధించేలా నిబంధనలు తీసుకువస్తే మార్పు వస్తుందని చెప్పారు. ఇదే విషయాన్ని తాను బీసీసీఐకి కూడా చెప్పానని తెలిపాడు.  చూడాలి మరి ఎంసీసీ ప్రతిపాదనపై బీసీసీ ఎలా స్పందిస్తుందో?

By
en-us Political News

  
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
2026 రక్షాబంధన్ సందర్భంగా సోదరుడి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేయాల్సిన పవిత్ర దానాల విశిష్టతలను తెలుసుకోండి. ఆహార ధాన్యాలు, బెల్లం, వస్త్రాలు మరియు నల్ల నువ్వుల దానం వల్ల కలిగే ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.