ఏఐ విప్లవం.. ప్రభుత్వాలపై భారం!
Publish Date:Apr 17, 2026
Advertisement
పని ఉండదు.. ప్రజలకు ప్రభుత్వమే డబ్బులివ్వాల్సిన రోజులు వస్తాయి.. ఎలాన్ మస్క్ సాంకేతిక ప్రపంచంలో నిత్యం సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ కారణంగా రానున్న కాలంలో మానవ జీవనశైలిని పూర్తిగా మారిపోతుందన్నారు. ముందు ముందు మనిషి తన ఉనికి కోసం, కనీస అవసరాల కోసం పని చేయాల్సిన అవసరం లేని రోజులు రాబోతున్నాయన్నారు. ఏఐ రంగం పదిరెట్లు వేగంగా వృద్ధి చెందుతోందని, ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే సగటు మనిషికి ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వాల బాధ్యతగా మారుతుందన్నారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డ్రైవర్లు మాత్రమే కాకుండా, భవిష్యత్ లో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు, సర్జన్ల అవసరం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆయన.. ప్రస్తుతం టెస్లా అభివృద్ధి చేస్తున్న ఆప్టిమస్ వంటి హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల కంటే అత్యంత వేగంగా, కచ్చితత్వంతో పనులను పూర్తి చేయగలవన్నారు.
http://www.teluguone.com/news/content/ai-revolution-governments-pay-36-217593.html





