కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు హైకోర్టులో ఊరట

Publish Date:Apr 24, 2026

Advertisement

 

తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రి కే తారక రామారావు, మాజీ మంత్రి టి హరీశ్ రావులకు పెద్ద ఊరట లభించింది.  2011లో నమోదైన కేసులను హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా 2011 మార్చిలో హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌పై భారీగా “మిలియన్ మార్చ్” నిర్వహించబడింది. రాష్ట్ర విభజనకు మద్దతుగా నిర్వ హించిన ఈ కార్యక్రమానికి వేలాదిమంది ఉద్యమకారులు హాజరయ్యారు. ఆ రోజు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కొందరు ఆందోళనకారులు మీడియా సంస్థల కెమెరాలు, ఓబీ వ్యాన్లు ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. 

దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆ సమయంలో ఉద్యమానికి నేతృత్వం వహించిన పలు వురు ప్రముఖ నాయకులను కూడా కేసులో నిందితులుగా చేర్చారు.దర్యాప్తు సమయంలో కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల పేర్లు చేర్చడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కేసులపై ముగ్గురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమకు ప్రత్యక్ష సంబంధం లేదని వారి తరఫు న్యాయవాది రమణారావు కోర్టులో వాదనలు వినిపించారు.

పిటీషనర్ల వాదనలు, కేసు వివరాలు పరిశీలించిన హైకోర్టు, ముగ్గురు నేతలపై నమోదు చేసిన కేసులకు తగిన ఆధారాలు లేవని అభిప్రాయపడింది. కేసుతో పిటీషనర్లకు ప్రత్యక్ష సంబంధం నిరూపించలేక పోయారని పేర్కొంటూ, హైకోర్టు కేసులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు దశాబ్దానికి పైగా కొనసా గుతున్న ఈ కేసులకు ముగింపు పలకడంతో, తెలంగాణ ఉద్యమ కాలానికి సంబంధించిన ఒక కీలక అధ్యాయం ముగిసినట్లైంది. ముగ్గురు నేతలకు కోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద ఊరటను ఇచ్చింది.

By
en-us Political News

  
అల్పైన్ టెక్స్‌వర్ల్డ్ ఐపీఓ NSE, BSE లలో రూ. 105 వద్ద ఫ్లాట్‌గా లిస్ట్ అయింది. రూ. 126.25 కోట్ల విలువైన ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ వివరాలు, కంపెనీ బిజినెస్ ప్లాన్స్, పూర్తి స్టాక్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
ఆల్ట్రాటెక్ సిమెంట్ క్యూ1 ఫలితాల్లో నికర లాభం 17% పెరిగి రూ. 2,599 కోట్లకు చేరింది. నువామా మరియు ఇతర బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ధరను రూ. 15,209 వరకు పెంచాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
పేటీఎం క్యూ1 ఫలితాల్లో నికర లాభం 79% పెరిగి రూ. 220 కోట్లకు చేరింది. షేర్లు లాభాల్లో దూసుకుపోతుండగా, గోల్డ్‌మన్ శాక్స్, సిటీ సంస్థలు భారీ టార్గెట్స్ ఇచ్చాయి. పూర్తి వివరాలు ఇక్కడే చదవండి.
2026 జూలై 21 నాటి NYT Strands Game 870 హింట్స్, స్పాంగ్రామ్ మరియు అన్ని సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. Write there థీమ్‌తో ఉన్న ఈ పజిల్‌ను సులభంగా సాల్వ్ చేయడానికి కావలసిన క్లూస్ మరియు పూర్తి సమాచారం మీకోసం!
ఐటీఆర్‌లో వీఆర్‌ఎస్ నిధులను అడ్వాన్స్ శాలరీగా తప్పుగా పేర్కొన్నప్పటికీ, పూణే ఐటీఏటీ రూ.65.21 లక్షల మొత్తానికి పన్ను మినహాయింపు ఇస్తూ కీలక తీర్పు వెలువరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
జాతీయ రహదారుల వినియోగదారులకు NHAI ఊరట! రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా 20 కిలోమీటర్ల పరిధిలోని వారికి డిజిటల్ లోకల్ పాస్ మరియు 22 భాషల్లో సేవలు అందించే మార్గమిత్ర హెల్ప్ సెంటర్‌ను ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
గతంలో కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం, తీవ్ర భయాందోళనలు ప్రజల మనస్సుల్లో ఇంకా సజీవంగానే ఉండటంతో ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ వ్యాపతి తీవ్ర ఆందోళనకు కరాణమౌతోంది. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ కొత్త కరోనా వేరియంట్ పెద్ద ప్రమాదకరమనది కాదని స్పష్టం చేసింది.
ఆమెతో ఏడాది నుంచి రిలేషన్‌లో ఉన్న..సూసైడ్‌ నోట్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి..!
ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సులభంగా యూపీఐ పేమెంట్స్ చేసేలా ఎన్‌పీసీఐ సరికొత్త ఎన్ఎఫ్సీ ఆఫ్‌లైన్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఫోన్ నెట్‌వర్క్ లేని ప్రదేశాల్లోనూ రూ. 2,000 వరకు పిన్ లేకుండా చెల్లించే విధానం మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ వన్డేలో 138 పరుగులతో సెంచరీ సాధించిన రోహిత్ శర్మకు పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అద్భుతమైన మద్దతు తెలిపారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు, విమర్శకులకు చెక్ పెడుతూ అక్మల్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.
భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ 2026 పూర్తి షెడ్యూల్, కొత్త మ్యాచ్ టైమింగ్స్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు వివరాలు మరియు ఉచిత లైవ్ స్ట్రీమింగ్ సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది.
ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఉద్రిక్త పరిణామాలు, పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుననారు. అంతర్జాతీయ వేదికలపై ప్రతి క్లిష్టమైన సమస్యనూ శాంతియుత సంప్రదింపులు, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఉద్బోధించే ప్రధాని నరేంద్ర మోదీ.. సొంత దేశంలో భవిష్యత్తు భారతాన్ని నిర్మించే విద్యార్థుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయడం ఎంటని నిలదీస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.