Publish Date:Apr 14, 2026
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది. సరఫరా ఆలస్యం, స్టాక్ లోపం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్యాస్ బుక్ చేసినప్పటికీ సమయానికి సిలిండర్లు అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్రామానికి డొమెస్టిక్ సిలిండర్లతో ఒక ఆటో చేరుకుంది. దాన్ని గమనించిన గ్రామస్థులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. డెలివరీ బాయ్ సిలిండర్లను క్రమంగా పంపిణీ చేస్తానని చెప్పినా వినకుండా, కొందరు వినియోగదారులు బలవంతంగా ఆటోపైకి ఎక్కి సిలిండర్లను తీసుకెళ్లారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఖాళీ సిలిండర్లు తిరిగి ఇవ్వకుండా, ఆటోలో ఉన్న సుమారు 40 సిలిండర్లను తీసుకెళ్లడంతో డెలివరీ బాయ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగ్లూర్ గ్రామంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కోసం గ్రామస్తులు గ్యాస్ ఏజెన్సీ వద్ద కిలోమీటరు పొడవున క్యూ కట్టారు. స్టాక్ వస్తుందనే సమాచారంతో తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రజలు ఏజెన్సీ ఎదుట వేచి ఉన్నారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్లు అందకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా లోపాలు ప్రజల రోజువారీ జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుండగా, తక్షణమే సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shortage-of-cooking-gas-36-217329.html
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని వి మార్క్ ఇండియా మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కరోజే 81% పతనమైందా ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో, 5:1 బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు మార్కెట్ లెక్కలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 8 శాతం పడిపోయాయి. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రత్యర్థి టైటాన్ కంపెనీ ఫలితాల ప్రభావం మరియు మార్కెట్ అంచనాల వల్ల ఈ భారీ పతనం సంభవించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నోబుల్ సంస్థ సరికొత్తగా తెచ్చిన నోబుల్ ఆస్ప్రే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ పూర్తి రివ్యూ. $199 ధర, బ్లూటూత్ 6.0, LDAC సపోర్ట్ ఉన్నా ఈ ఇయర్‌బడ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఇక్కడ చదవండి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వైరల్ హిట్ నింజా లక్స్ కేఫ్ ప్రీమియర్ ఎస్ప్రెస్సో మెషిన్‌పై ఏకంగా 53% భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆస్ట్రేలియాలో ఆల్-టైమ్ లో ధరకు దొరుకుతున్న ఈ త్రీ-ఇన్-వన్ కాఫీ మేకర్ ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు కానుందా? రాబోయే 12 నెలల్లో సెన్సెక్స్ లక్ష మార్కును తాకడానికి ఉన్న అవకాశాలు, బుల్ మార్కెట్ ర్యాలీని ప్రేరేపించే కీలక ఆర్థిక అంశాలపై మోర్గాన్ స్టాన్లీ Morgan Stanley నివేదిక పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో సెన్సెక్స్ వచ్చే 12 నెలల్లో 1,00,000 మార్కును తాకే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. మార్కెట్ తదుపరి భారీ ర్యాలీకి కారణమయ్యే బుల్, బేస్, బేర్ కేస్ సినారియోల పూర్తి వివరాలు మీకోసం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంకింగ్ రంగంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వినియోగంపై కొత్త డ్రాఫ్ట్ రూల్స్ తెచ్చింది. మోడల్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం తెచ్చిన ఈ నిబంధనలతో బ్యాంకింగ్ రంగంలో ఏఐ గవర్నెన్స్, మోడల్ వాలిడేటర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూలై 7న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ. 13,600 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ సహా మీ నగరంలో నేటి 22K, 24K పసిడి లేటెస్ట్ రేట్లను ఇప్పుడే తెలుసుకోండి!
జపాన్ వెళ్లే భారతీయ ప్రయాణికులకు అలర్ట్. కొత్త వీసా నిబంధనలు, ఈ వీసా ప్రాసెస్, మారిన ఫీజుల వివరాలు మరియు ట్రాన్సిట్ వీసా రద్దు గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచాయి. SBI, HDFC, PNB మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 7.50% నుండి 9.00% వరకు లభిస్తున్న గరిష్ట వడ్డీ రేట్లు, కాలపరిమితి మరియు పన్ను ఆదా వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ నెల 1న ఆయన ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో సమాజ శాంతిని దెబ్బతీసేలా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు ఏ మాత్రం మంచివి కావన్నారు.
నోయిడాకు చెందిన సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ క్రాటికల్ టెక్ Kratikal Tech BSE SME ప్లాట్‌ఫామ్‌పై గ్రాండ్‌గా లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ట్రేడింగ్ నిబంధనలు, పెట్టుబడి వివరాలు మరియు థ్రెట్‌కాప్ ThreatCop సాస్ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తుపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.