క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు: నలుగురు మృతి.!

Publish Date:Oct 24, 2026

Advertisement

బీహార్‌లోని సీవాన్ జిల్లాలో  ఓ బాణా సంచా ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో కనీసం నలుగురు మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం (అక్టోబర్ 23) సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  

పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పూర్తిగా నేలమట్టమైంది.పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది.   సీవాన్ జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు  ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను  పర్యవేక్షించారు.  మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, అవయవాలు చిన్నాభిన్నమవ్వడంతో   గుర్తింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది.  నివాస ప్రాంతాల మధ్య ఎలాంటి తగిన భద్రతా ప్రమాణాలు లేకుండా నిర్వహిస్తున్న ఇలాంటి అక్రమ బాణసంచా తయారీ కేంద్రాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

[Blast In Cracker Factory, Bihar, Siwan District, Alampur, Four Dead, Telugu One]

By
en-us Political News

  
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.