Publish Date:Apr 14, 2026
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు. ఈ యువ చిచ్చర పిడుగు దూకుడుగా ఆడుతూ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. 15 ఏళ్ల ఈ కుర్రాడిని సీనియర్ భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు ఇతర యువ ఆటగాళ్లతో పాటు ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అభ్యర్థుల జాబితాలో సూర్యవంశీకి కూడా చోటు దక్కినట్లు సమాచారం.
అదే జరిగితే.. భారత్ తరఫున జట్టులోకి అరంగేట్రం చేసే అతిపిన్న వయస్కుడిగా వైభవ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. ఇప్పటివరకు ఈ ఘనత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(16 ఏళ్లు) పేరిట ఉంది. వైభవ్ ఇప్పటికే ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో నిన్న హైదరాబాద్‌పై తప్ప.. మిగతా నాలుగు మ్యాచుల్లోను దూకుడుగా ఆడేశాడు.
ఐపీఎల్ ముగిసిన కొన్ని రోజులకే టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో షార్ట్‌లిస్ట్‌లో వైభవ్‌కు చోటు దక్కినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఐర్లాండ్ పర్యటనలో చక్కటి ప్రదర్శన చేస్తే.. జింబాబ్వేతో సిరీస్‌కూ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం16 ఏళ్ల 205 రోజుల వయస్సులో అరంగేట్రం చేసిన టెండూల్కర్, భారత పురుషుల జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా అయితే ఈ రికార్డు షఫాలీ వర్మ పేరిట ఉంది. ఆమె 15 ఏళ్ల 7 నెలల 27 రోజుల వయస్సులో భారత మహిళల జట్టులోకి అరంగేట్రం చేసింది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vaibhav-suryavanshi-to-break-sachins-record-36-217332.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.