శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ‘హై అలర్ట్’.. అడుగడుగునా నిఘా..!

Publish Date:Aug 11, 2026

Advertisement

 

శంషాబాద్ విమానాశ్రయం... ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం.... వేలాది మంది ప్రయాణికులు.. వందలాది వాహనాలు.. నిత్యం రాక పోకలతో సందడిగా ఉండే ప్రదేశం అది..... కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ఆగస్టు 15 నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా భద్రతా బలగా లను రెట్టింపు చేశారు. సీఐఎస్ఎఫ్‌తో పాటు స్థానిక పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తు న్నారు. 

ప్రయాణికుల లగేజీని స్కానర్లతో పరిశీలిస్తున్నారు. అనుమానం కలిగించే వ్యక్తులపై ప్రత్యేకంగా ఆరా తీస్తు న్నారు. ఎయిర్‌పోర్ట్ సందర్శకులకు పాసుల జారీపై కూడా ఆంక్షలు విధించారు. టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాలు, పరిసరాల్లో అనుమానిత వస్తువులు ఏమైనా ఉన్నాయా అని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతోంది. 

అనుమా నాస్పద కదలికలు, వస్తు వులపై భద్రతా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికులు తమ లగేజీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్ప గించవద్దని అధికారులు సూచించారు. అనుమా నాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి సమా చారం ఇవ్వాలని కోరారు.
ఆగస్టు 15 నేపథ్యంలో ప్రారంభమైన ఈ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఆగస్టు 31 వరకు  కొనసాగుతుందని ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో అడుగడుగునా భద్రతా సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరిస్తున్నారు.

Shamshabad Airport on high alert, CISF, Independence Day Celebration, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand,Telangana police
 

By
en-us Political News

  
చంపేస్తే బెయిల్ వస్తుంది.. వైసీపీ నేత వీడియో వైరల్..!
ఎల్బీనగర్ ఏసీపీ కార్యా లయంలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది.
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో బలం పుంజుకునే దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అసెంబ్లీకి ముఖం చాటేయడం దగ్గర నుంచి, వైసీపీ అధినేత జగన్ చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వరకూ వైసీపీ చర్యలన్నీప్రజలకు దూరం జరిగేలాగే ఉన్నాయి. 
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విధి నిర్వహణకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు తీవ్ర ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ.. మొత్తం 3.38 కోట్లు..!
దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ.. నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు పార్లమెంట్ ఆమోదం..!
నటి త్రిషపై అన్నాడీఎంకే నేత ఘాటు వ్యాఖ్యలు..!
పుష్కరాలకు వచ్చే భక్త కోటికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకుఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు కుంభమేలా ఏర్పాట్లను తలదన్నేలా ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.
అత్యాచార ఆరోపణలపై యువ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో ఏం చేసినా ఎవరికీ తెలియదనుకున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూస్తూ క్షణికానందం పొందాడు.
ప్రస్తుతం పీఓకే, మరియు బలూచిస్థాన్‌లు ప్రజా తిరుగుబాటుతో అట్టుడుకుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడడ అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాజా అశాంతి, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్థాన్.. భారత్ లో విధ్వంసం కుట్రకు తెరలేపిందని పరిశీలకులు అంటున్నారు.
విఐపి మొబైల్ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్ అంటే ఏమిటి? 9999, 0000, 786, 1234 వంటి నంబర్లను ఆన్‌లైన్‌లో ఎలా ఎంచుకోవాలి, ధర వివరాలు మరియు భద్రతా జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.