ఔను! తెలంగాణా ఎంపిలు అజిత్‌సింగ్‌ను ఇష్టపడుతున్నారు?

Publish Date:Oct 9, 2012

Advertisement

తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం అంశం ఇప్పట్లో తేలదని అందరికీ అర్థమైంది.  అయితే ప్రత్యేక తెలంగాణా సాధన పేరిట ఏర్పాటైన టిఆర్‌ఎస్‌ ఏమీ సాధించలేకపోవటంతో ఆ ప్రాంతంలో కొత్తదనం కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ రాష్ట్రీయలోక్‌దళ్‌పార్టీ (ఆర్‌ఎల్‌డి) తెలంగాణాశాఖను ఏర్పాటు చేశారు. దీని నిమిత్తం ఆయన పర్యటనకు వచ్చారు. వెంటనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా ఎంపిలు అజిత్‌సింగ్‌ను కలవటం, పెద్దహడావుడి చేయటం జరిగాయి. దీన్ని బట్టి ఏమి అర్థమవుతోంది? అని పలువురిని ప్రశ్నిస్తే తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపిలు అజిత్‌సింగ్‌ను ఇష్టపడుతున్నారు అని సమాధానం వచ్చింది.  నిజం కూడా అదే. ఎందుకంటే ప్రత్యేకతెలంగాణా ఇవ్వటానికి ఇష్టపడని కాంగ్రెస్‌ ఈ ఎంపిలను పదవి నుంచి తప్పుకోమంటే ప్రత్యామ్నాయంగా అజిత్‌సింగ్‌ను వారు ఎంచుకున్నారు. అజిత్‌సింగ్‌ వెనుక ఉంటే కనీసం రాష్ట్రీయలోక్‌దళ్‌పార్టీ ఆశ్రయమైనా దక్కుతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి టిఆర్‌ఎస్‌ అంటే ఇష్టపడని వారందరికీ ఆర్‌ఎల్‌డి పెద్దవేదిక కాబోతుంది. ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే అన్న నినాదంతో ఏర్పాటైన తెలంగాణా జెఎసి కూడా అజిత్‌సింగ్‌కు తమ సహకారాన్ని అందిస్తోంది. టిఆర్‌ఎస్‌, బిజెపిలతో పాటు ఆర్‌ఎల్‌డిని కూడా వినియోగించుకుంటామని జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. దీంతో అజిత్‌సింగ్‌ రాకను ఆయన పరోక్షంగా మద్దతిచ్చారు. ఎంపిలతో పాటు పరోక్షంగా మద్దతు ఇచ్చిన కోదండరామ్‌ అజిత్‌సింగ్‌ను కలిశారు.  అసలు విషయాన్ని పరిశీలిస్తే అజిత్‌సింగ్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌ తెలంగాణా ప్రాంతమని కొత్తవార్తలు వినిపిస్తున్నాయి. తమ పార్టీలో అందరూ బయటికిపోతే తెలంగాణా ప్రాంతంలో 2014లో కొన్ని స్థానాల్లోనైనా విజయం సాధిస్తే ఆర్‌ఎల్‌డి మద్దతు కాంగ్రెస్‌ మిగుల్చుకునేందుకు ఇదో కొత్తవ్యూహమంటున్నారు. ఇదే నిజమైతే కాంగ్రెస్‌ అధిష్టానమే ప్రత్యామ్నాయం కోసం ఆర్‌ఎల్‌డిని ప్రోత్సహిస్తోందని చెప్పుకోవాలి. ఏమైనా తెలంగాణా ఎంపిల వైఖరి గురించి పిసిసి నేతలు పెదవి విప్పలేదంటే ఓరకంగా పై విషయం వాస్తవమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

By
en-us Political News

  
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.