ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే : మంత్రి సీతక్క

Publish Date:Aug 9, 2026

Advertisement

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని కొమరం భీం విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతు..ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే అని మంత్రి సీతక్క అన్నారు. హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆదివాసులు ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. 

సమ్మక్క–సారలమ్మ నుంచి బిర్సా ముండా, రాంజీ గోండు, కొమురం భీమ్ వరకు అనేక మంది ఆదివాసీ నాయకులు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. వారి పోరాటాల్లో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేక హక్కులు కల్పించిందని.. ఐదో షెడ్యూల్ ద్వారా ప్రత్యేక రక్షణలు ఉన్నాయని సీతక్క తెలిపారు. అయితే వాటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో ఆదివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

తమకు ఎవరిపైనా శత్రుత్వం లేదని.. ఏ ప్రాంత ప్రజలనూ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాడాలని ఆదివాసులకు పిలుపునిచ్చారు. అడవిపై హక్కులు, ఉద్యోగాలు, ఇళ్లపై హక్కులు తమ ప్రధాన డిమాండ్లని సీతక్క చెప్పారు. అధికారులు పేద ఆదివాసులను, ఇతరులను వేర్వేరుగా చూడకూడదని.. అందరినీ సమానంగా చూడాలని సీతక్క సూచించారు.

ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక నిధుల కోసం ఆరుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలం కలిసి మంత్రులను కలుస్తున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదలు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని సీతక్క అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఇళ్లను కేటాయించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి దక్కుతుందని చెప్పారు.

కొమురం భీమ్ ‘జల్, జంగల్, జమీన్’ కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమంలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.ఆదివాసులు తమ భాష, వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సీతక్క సూచించారు. ఇవే తమ అస్తిత్వానికి, గుర్తింపునకు ప్రతీకలని అన్నారు. కొమురం భీమ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆదివాసులకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Seethakka,Telangana Minister Seethakka,Tribal Rights, Adivasi Rights, Tribal Welfare,
Tribal History,Tribal Struggles, Komaram Bheem, Jal Jangal Zameen,Sammakka Sarakka

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్‌ రాజకీయంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. !
ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 5న చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన విషాదాం తమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారబోతోంది.
మహారాష్ట్రలోని పూణే జిల్లా, బారామతి ప్రాంతం మరోసారి విమాన ప్రమాదంతో ఉలిక్కిపడింది.
విజయవాడ నగరం వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ హైదరాబాద్ నగరం అంతటా అత్యంత కోలాహలంగా, అంగరంగ వైభవంగా సాగుతోంది.
మెడికోపై కారు దాడి కేసు.. అది ప్రమాదం కాదు..!
సెలవుపై స్వగ్రామానికి బయల్దేరిన సైనికుడు..మిస్సింగ్‌పై అనుమానాలు..!
విద్యార్థులకు కళాత్మక తయారీ మరియు ప్రదర్శనలో శిక్షణ నిచ్చే తీరుపై మ్యూజియం నిర్వహుకులతో చర్చించారు.
భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ ఉప్పొంగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
పాతబస్తీలో ఘనంగా బోనాల పండుగ శోభ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.