తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం... తేజస్వీ క్షమాపణ చెప్పాలి : కేటీఆర్

Publish Date:Apr 16, 2026

Advertisement

 

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

కమలం నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలుకొని ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు పైన విషం కక్కుతూ…బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు 

తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందిందని ఆయన గుర్తు చేశారు. అస్తిత్వం కోసం ప్రజలు చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదకర సంఘటనలతో పోల్చడం ద్వారా బీజేపీ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు.

పార్లమెంట్ సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా, అక్కడే ఉన్న ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కనీసం తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం కాషాయ పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణం అన్నారు.  తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేకపోయిన వీరు, ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న ఈ ఎంపీల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. తెలంగాణను కించపరిచిన తేజస్వీ  తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు కమలం పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలే బీజేపీ అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందన్నారు.

By
en-us Political News

  
ఏపీ రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యంత ఆధునిక నివాస సముదాయాల నిర్మాణానికి ఏకంగా 1,234.91 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
రాష్ట్రంలో మహిళల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు తమిళనాడు వ్యాప్తంగా హైటెక్ డ్రోన్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. తమిళనాడు చరిత్రలోనే ఇటువంటి ఒక అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థను మహిళా రక్షణ కోసం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనీ, పలు చోట్ల పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో మహా సమరానికి ముందు సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ తమ జట్టును హెచ్చరించింది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత వ్యూహాలు మార్చాలని డిమాండ్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
భారతీ రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయ్.. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు భారతీరాజా భౌతిక కాయానికి సీఎం విజయ్ ఘన నివాళులర్పించారు.
bengaluru new eleven km flyover plan,Bengaluru new flyover, Indiranagar traffic updates, Madiwala rotary flyover, Silk Board double decker flyover, Bengaluru elevated corridor, B SMILE project DPR,teluguone,teluguone news.
ఆసియా గేమ్స్ 2026 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన యువ జట్టును ప్రకటించింది. బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిదిలను పక్కన పెట్టి సాహిబ్జాదా ఫర్హాన్‌కు కెప్టెన్సీ అప్పగించింది. ఆ పూర్తి షెడ్యూల్, టీమ్ వివరాలు ఇక్కడ చూడండి.
చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు మోహన్ నాయక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
భారత యువ చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రణేష్ మునిరత్నం హాంకాంగ్ వీసా సమస్యల్లో చిక్కుకున్నారు. జూన్ 16 నుండి జరిగే వరల్డ్ టీమ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌కు ముందు కోచ్ ఆర్‌.బి. రమేష్ అధికారుల సహాయాన్ని కోరుతూ చేసిన విజ్ఞప్తి వివరాలు ఇక్కడ చదవండి.
LegalZoom ద్వారా సులభంగా మరియు తక్కువ ఖర్చుతో LLC, ఎస్టేట్ ప్లాన్, మరియు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. తాజా ప్రోమో కోడ్స్ మరియు సేవింగ్స్ టిప్స్‌తో మీ వ్యాపార ఖర్చులను తగ్గించుకోండి!
సైబర్ దాడులను తిప్పికొట్టడానికి ఆంత్రోపిక్ సంస్థ ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్ లో బ్రిటన్ టెలికాం దిగ్గజం బిటి చేరింది. రోజుకు 40 లక్షల దాడులను అడ్డుకునే బిటి, క్లాడ్ మైథోస్ ఏఐ మోడల్ ద్వారా భద్రతను మరింత పెంచుతోంది. భారత్ సహా 15 దేశాలకు విస్తరించిన ఈ ఏఐ సెక్యూరిటీ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
దక్షిణ కొరియా మార్కెట్లో ఐదేళ్ల గరిష్టానికి చేరిన పుట్-కాల్ రేషియో గ్లోబల్ స్టాక్ మార్కెట్ల పతనానికి సంకేతంగా మారుతోంది. గతంలో 17 శాతం కుప్పకూలిన చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.