టర్కీలో రక్తమోడిన పాఠశాల.. విద్యార్థి కాల్పుల్లో 9 మంది మృతి

Publish Date:Apr 16, 2026

Advertisement

టర్కీలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్నారి విద్యార్థి   తోటి విద్యార్థులపై తూటాల వర్షం కురిపించాడు. కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని ఒక పాఠశాలలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన విద్యార్థి కూడా చివరకు మరణించడంతో పాఠశాల ప్రాంగణం రక్తసిక్తమైంది. వివరాలిలా ఉన్నాయి. 

 అయ్సెర్ కాలిక్ మిడిల్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి   బుధవారం (ఏప్రిల్ 15)  స్కూలుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో  రెండు వేర్వేరు తరగతి గదుల్లో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా పేలిన తూటాలతో విద్యార్థులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.

ఈ కాల్పుల ఘటనలో ఒక ఉపాధ్యాయుడు, ఎనిమిది మంది విద్యార్థులూ మరణించగా, మరో 13 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, వారిలో ఆరుగురి పరిస్థితి  విషమంగా ఉంది. నిందితుడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

దర్యాప్తులో భాగంగా నిందితుడి తండ్రి ఉగుర్ మెర్సిన్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన గతంలో పోలీస్ అధికారిగా పనిచేసినట్లు గుర్తించారు. తన తండ్రికి చెందిన ఐదు తుపాకులను నిందితుడు ఈ దాడి కోసం ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడైన విద్యార్థి పోలీసుల కాల్పుల్లో చనిపోయాడా లేక తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయంలో క్లారిటీ లేదు. టర్కీలో  రెండు రోజుల వ్యవధిలోనే  పాఠశాల కాల్పుల ఘటన  జరగడం ఇది రెండోసారి.  దేశంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతి,   టీనేజర్లలో పెచ్చరిల్లుతున్న హింసా ప్రవృ త్తిపై ఆందోళన వ్యక్తమౌతోంది.  

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.