కోచ్ కోసం విద్యార్థుల ఆందోళన.. సరూర్‌నగర్ స్టేడియంలో రెండో రోజూ నిరసన..!
Publish Date:Aug 23, 2026
Advertisement
సరూర్‌నగర్ స్టేడియంలో క్రికెట్ కోచ్‌ను నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన రెండో రోజూ కొనసాగుతోంది. గత మూడు నెలలుగా స్టేడియంలో క్రికెట్ కోచ్ లేకపోవడంతో విద్యార్థులు శిక్షణకు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌పై ఆసక్తితో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్టేడియానికి వస్తున్నప్పటికీ.. వారికి సరైన మార్గనిర్దేశం చేసే కోచ్ లేకపోవడంతో శిక్షణకు ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. మూడు నెలలు గడిచినా అధికారులు సమస్యను పరిష్కరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరూర్‌నగర్ స్టేడియంలో వెంటనే అర్హత కలిగిన క్రికెట్ కోచ్‌ను నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కోచ్ అందుబాటులో ఉంటే విద్యార్థులకు క్రమం తప్పకుండా శిక్షణ అందించడంతో పాటు వారి ప్రతిభను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్టేడియంలో ఉన్న క్రీడా సౌకర్యాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డిమాండ్‌పై వెంటనే స్పందించి కోచ్‌ను నియమించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు, తల్లిదండ్రులు హెచ్చరించారు. మూడు నెలలుగా కొనసాగుతున్న కోచ్ కొరతపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. Saroornagar Stadium, Cricket coach, CM Revanth reddy, Telangana government
http://www.teluguone.com/news/content/saroornagar-stadium-24-229612.html





