దీప్కే దాడి వెనుక ఆర్ఎస్ఎస్?

Publish Date:Jun 17, 2026

Advertisement

నీట్- పేపర్ లీక్  పై నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో, జైపూర్‌లో తనపై జరిగిన దాడి వెనుక   ఆరెస్సెస్ హస్తం ఉందని  కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు.  నీట్ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆర్ఎస్ఎస్ ఈ దాడికి పాల్పడిందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. దేశంలో విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్న దీప్కే..ఇటువంటి దాడులకు   భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంగళవారం (జూన్ 16) మీడియాతో మాట్లాడిన ఆయన  తాము గాంధీ, అంబేద్కర్‌ల ఆశయాల బాటలో నడిచే సత్యాగ్రహులమని అన్నారు.  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. 

సోమవారం (జూన్ 15) జైపూర్‌ ర్యాలీలో, కార్యకర్తల భుజాలపై ఉన్న దీప్కేపై కొందరు   వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.  ఈ నెల 21న నీట్ పునఃపరీక్ష జరగనుంది. ఈ వివాదంపై పోరాడేందుకు అమెరికా నుంచి తిరిగి వచ్చిన దీప్కే..  ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారు. కాగా, దీప్కే చేసిన ఆరోపణలపై ఆరెస్సెస్ ఇప్పటి వరకూ స్పందించలేదు.  

By
en-us Political News

  
ప్రస్తుతం పీఓకే, మరియు బలూచిస్థాన్‌లు ప్రజా తిరుగుబాటుతో అట్టుడుకుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడడ అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాజా అశాంతి, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్థాన్.. భారత్ లో విధ్వంసం కుట్రకు తెరలేపిందని పరిశీలకులు అంటున్నారు.
విఐపి మొబైల్ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్ అంటే ఏమిటి? 9999, 0000, 786, 1234 వంటి నంబర్లను ఆన్‌లైన్‌లో ఎలా ఎంచుకోవాలి, ధర వివరాలు మరియు భద్రతా జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
దేశంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులపై పార్లమెంటరీ సంఘం ఆందోళన..!
సోషల్ మీడియాలో పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. వ్యక్తిగత వివరాల సేకరణ.. చివరకు బ్లాక్‌మెయిల్! హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ ప్రజల జీవితాలను, వ్యాపార ఆశయాలను ఎలా మారుస్తుందో తెలుసుకోండి. వోడాఫోన్ సర్వేలోని కీలక గణాంకాలు, విజయావకాశాలు మరియు ఎదురవుతున్న సవాళ్లపై ప్రత్యేక కథనం.
పెళ్లైన ఆరు నెలల్లోనే విషాదం..!
ఆస్ట్రేలియా సెన్సస్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆగస్టు 11 సెన్సస్ నైట్ తేదీ, నిబంధనలు, AU$364 జరిమానాలు, ఎవరు అర్హులు మరియు హెల్ప్‌లైన్ సమాచారం ఇక్కడ చూడండి.
జంతర్ మంతర్‌లో ఓ న్యాయం.. ఝార్ఖండ్‌లో మరో న్యాయమా..!
లీప్ ఇండియా ఐపీఓ LEAP India IPO బిడ్డింగ్ చివరి రోజు సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం GMP , ఐపీఓ ధర, లిస్టింగ్ తేదీలు మరియు విశ్లేషకుల సబ్‌స్క్రైబ్ రేటింగ్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1.75 లక్షలకు పైగా యూఎస్ వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేరారోపణలు, బర్త్ టూరిజం, $5 మిలియన్ల ఆర్థిక స్కామ్‌లు మరియు సోషల్ మీడియా పోస్టులే ప్రధాన కారణంగా వీసాల వేటు పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో ఉన్న సంచలనాత్మక లంచం మరియు మోసం కేసును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపూర్ణ కథనం కోసం చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.