రోహిత్ శర్మ రీఎంట్రీ ... ముంబై ఇండియన్స్‌కు బిగ్ రిలీఫ్
Publish Date:Apr 25, 2026
Advertisement
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలే సాధించిన ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ అభిమానులకు ఐపీఎల్ వర్గాలు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గాయం కారణంగా ఆటకు దూరమైన స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఆడతాడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 12న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కండరాల గాయంతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లకు రోహిత్ బెంచ్ పైనే ఉన్నాడు. మళ్లీ బరిలోకి దిగడానికి రోహిత్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు మరో నాలుగు రోజుల సమయం ఉండటంతో అప్పటికి ఫుల్ ఫిట్‌నెస్ సాధిస్తాడని ముంబై ఇండియన్స్ తెలిపింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న ముంబై జట్టుకి రోహిత్ శర్మ లేకపోవడంపెద్ద లోటుగానే మారింది. అతడి స్థానంలో రిప్లేస్ చేసిన క్వింటన్ డికాక్ నిలకడగా రాణిస్తూ.. ఓ సెంచరీ కూడా నమోదు చేశాడు. అయితే నాన్‌స్ట్రైకింగ్ నుంచి పెద్దగా సహకారం లభించట్లేదు. రోహిత్ తిరిగి మైదానంలోకి దిగితే ఎంఐ విజయాల బాట పట్టే అవకాశం ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. మిగతా ఏడు మ్యాచుల్లో కనీసం ఒక్కటి ఓడినా.. ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయినట్లే. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ఈ సీజన్‌ను మెరుగ్గానే ప్రారంభించాడు. నాలుగు మ్యాచుల్లో 137 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. కానీ గాయం కారణంగా బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఫిట్‌నెస్ సాధించి రోహిత్ శర్మ జట్టులో చేరాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/rohit-sharmas-reentry-36-218254.html





