కేసీఆర్ కుంభస్థలాన్ని కొట్టిన రేవంత్.. బీజేపీకి మైండ్‌బ్లాంక్..
Publish Date:Dec 27, 2021
Advertisement
కొన్ని వారాలుగా ఒకే పొలిటికల్ ఫైట్. వరి పైనే వార్. యాసంగి వడ్లు కొంటారా? కొనరా? కేంద్రానికి కేసీఆర్ సూటి ప్రశ్న. ఒప్పందం మేరకు వానాకాలం ధాన్యం అమ్ముతారా? లేదా? రాష్ట్రాన్ని కేంద్రం నిలదీత. కేసీఆర్ వర్సెస్ బీజేపీ ఎపిసోడ్ డైలీ సీరియల్‌గా రంజుగా మారింది. ముఖ్యమంత్రే స్వయంగా ధర్నాచౌక్‌లో దీక్ష చేయాల్సి వచ్చింది. వరి వార్ ఢిల్లీని సైతం తాకింది. చలికాలంలో రాజకీయ వేడి రగిలించింది. ఈ వడ్ల ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. నెల రోజులుగా రేవంత్ వాయిస్ గట్టిగా వినిపించిందే లేదు. రేవంత్‌రెడ్డిని సైడ్ చేసేందుకే.. కేసీఆర్, బీజేపీ ఇలా ధాన్యంపై ధూంధాం చేస్తున్నాయనే ఆరోపణ కూడా ఉంది. తన టైమ్ వచ్చే వరకు రేవంత్ సైతం ఓపిగ్గా వెయిట్ చేశారు. పార్లమెంట్ సెషన్ ముగిసి.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ అడుగుపెట్టగానే.. రేవంత్‌రెడ్డి పంజా విసిరారు. నేరుగా కేసీఆర్ కుంభస్థలాన్నే దెబ్బకొట్టేలా.. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో వరి సాగు మేటర్ బయటపెట్టారు. రెండు నెలలుగా టీఆర్ఎస్-బీజేపీ చేస్తున్న ఉత్తుత్తి ఫైట్‌కు అసలైన టర్న్ తీసుకొచ్చారని అంటున్నారు. వేటాడే సింహంలా.. ఒపిగ్గా ఎదురుచూశారు రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో, కేంద్రం దగ్గర ఫుల్ హడావుడి చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీలను వాటి మానాన వాటిని వదిలేశారు. ఎంతగా ఎగిరెగిరి పడతారో పడండంటూ కాస్త తగ్గారు. రేవంత్‌రెడ్డి సైడ్ అవగానే.. ఇదే ఛాన్స్‌గా.. ఇటు కేసీఆర్, అటు బండి సంజయ్-కిషన్‌రెడ్డి బాగా హడావుడి చేశారు. కేసీఆర్ బీజేపీని తిట్టడం.. కమలనాథులు కేసీఆర్‌ను తిట్టడం.. కొంతకాలంగా ఇదే డైలాగ్ వార్. మధ్యలో రైతులు పరేషాన్. ఎవరు కొనేది మాకెందుకు.. మేం ఎప్పటిలానే ఈసారి కూడా వరి వేస్తామని అన్నదాతలు. వరి వేస్తే ఉరేనంటూ కేసీఆర్ వార్నింగ్‌లు.. మీరు వేయండి మేం చూసుకుంటామంటూ రాష్ట్ర బీజేపీ నేతల హామీలు.. మేము మాత్రం కొనేది లేదంటూ చెప్పీచెప్పకుండా కేంద్రం కప్పదాటు యవ్వారం.. ఇలా రేవంత్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చేదాకా తెలంగాణలో వడ్లపై రాజకీయం రచ్చ.. రొచ్చుగా మారింది. టీఆర్ఎస్, బీజేపీలు ఇలా గొడవపడుతుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం బాధ్యతగల ఎంపీగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. వింటర్ సెషన్ వాయిదా పడేదాక.. పెద్దగా హడావుడి చేయలేదు. పార్లమెంట్ ముగిశాక.. హైదరాబాద్ తిరిగొచ్చాక.. రేవంత్‌రెడ్డి కొట్టిన దెబ్బకు ఇటు కేసీఆర్‌కు, అటు బీజేపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందంటున్నారు. ఇన్నాళ్లూ బీజేపీ చేసిన ఆరోపణలు రైతుల తలకు ఎక్కలేదు. వడ్లపై అసలేం జరుగుతోందనే క్లారిటీ రాలేదు. కేసీఆర్ చెప్పేది నిజమా? బీజేపీ చెబుతున్నది నిజమా? అర్థం కాని కన్ఫ్యూజన్లో ప్రజలు పడిపోయారు. కానీ, రేవంత్‌రెడ్డి అలా కాదు.. ఒకే ఒక్క ఆరోపణతో.. సూటిగా, సుత్తిలేకుండా.. కేసీఆర్‌ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌తో రైతులకు సినిమా మొత్తం అర్థమైపోయింది. కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్‌లో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.. కేసీఆరే వరి సాగు చేయంగా.. రైతులు చేస్తే తప్పేంటి? కేసీఆర్ పండించే వడ్లు ఎవరు కొంటారో.. రైతులు పండిచే ధాన్యం కూడా వాళ్లే కొంటారంటూ రేవంత్‌రెడ్డి తేల్చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో వరి సాగు చేసిన వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేయడం.. ఎర్రవల్లికి వెళ్లే ప్రయత్నాన్ని పోలీసులు బలవంతంగా అడ్డుకోవడం.. రోజంతా ఇదే రచ్చ జరగడంతో రేవంత్‌రెడ్డి టాపిక్, కేసీఆర్ వరి సాగు విషయంపై రైతుల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. తానే తన ఫామ్‌హౌజ్‌లో ఏకంగా 150 ఎకరాల్లో వరి వేయడంతో రైతులు అవాక్కవుతున్నారు. దొర వేస్తే ఒప్పు.. రైతు వేస్తే తప్పా? అని మండిపడుతున్నారు. ఇంకేం. మొత్తం ఖుల్లం ఖుల్లం. కేసీఆర్-బీజేపీల ఖేల్ ఖతం. దుఖాణం బంద్. రెండు నెలలుగా బీజేపీ చేయలేనిది.. రేవంత్‌రెడ్డి ఒక్క రోజులోనే కేసీఆర్‌ను దోషిగా చూపించగలిగారు. ఓవర్‌నైట్ వడ్ల రాజకీయంలో రియల్ లీడర్‌గా నిలిచారు. దటీజ్ రేవంత్‌రెడ్డి అంటున్నారు కాంగ్రెస్‌వాదులు.
http://www.teluguone.com/news/content/revanthreddy-upper-hand-in-paddy-crop-politics-39-129172.html





